Begin typing your search above and press return to search.

ఈ సిత్రమేంది సామీ? పన్ను పీకితే మూడు రోజులు విశ్రాంతా?

By:  Tupaki Desk   |   6 April 2022 9:35 AM GMT
ఈ సిత్రమేంది సామీ? పన్ను పీకితే మూడు రోజులు విశ్రాంతా?
X
ఇప్పుడీ వార్త చదివే వారిలో చాలామంది ఏదో ఒక సందర్భంలో పన్ను పీకించుకునే ఉంటారు. పన్ను పీకించుకోవటం.. ఆ తర్వాత జరిగే దానికి సంబంధించిన అవగాహన అందరిలోనూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా లేకున్నా.. పన్ను పీకిన కాసేపటికే పంపటం.. చాలామంది ఆఫీసులకు వెళ్లేవారు.. లేదంటే ఆఫీసుకు నుంచి తిరిగి వచ్చేటప్పుడు పన్ను పీకించుకొని ఇంటికి వెళ్లిపోయే వారు ఉంటారు. రెండు.. మూడు గంటల్లో అంతా సెట్ కావటమే కాదు.. ఒకట్రెండు రోజుల్లో అలవాటుగా మారిపోతుంది. పన్ను పీకిన ఒక రోజు మాత్రం తినే తిండి విషయంలో కాస్త ఇబ్బంది ఉంటుంది. యాంటీ బయాటిక్స్.. నొప్పి లేకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్స్ రాసివ్వటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంటి సమస్యతో ఇబ్బంది పడటం.. తెలంగాణలోఉన్న వేలాది మంది పంటి డాక్టర్లనుకాదని.. ఢిల్లీలో ఉన్న ఆయన పర్సనల్ డెంటిస్టు దగ్గరకు వెళ్లి.. పన్ను పీకించుకున్న సంగతి తెలిసిందే.

పన్ను పీకించుకున్న దానికి మూడు రోజులు రెస్టు చెప్పటం.. అందుకు తగ్గట్లే ఆయన హస్తినలో ఉండిపోవటం విశేషం. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కేసీఆర్.. చిన్నపాటి పన్నును పీకితే మూడు రోజులు ఇంట్లో కూర్చొని రెస్టు తీసుకోవాలా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఎంత కేసీఆర్ అయితే మాత్రం.. పన్ను పీకించుకుంటే ఇన్నేసి రోజులు రెస్టు తీసుకోవటం ఏమిటన్న ప్రశ్న ఒకటైతే.. పన్ను పీకించుకోవటానికి ఢిల్లీకి వెళ్లాలా? హైదరాబాద్ ఏమైపోయింది? అని ప్రశ్నిస్తున్నోళ్లు తక్కువేం కాదు.

ఒకవేళ ఇలాంటి పనే ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి చేసి ఉంటే.. తెలుగు రాష్ట్రంలో ఎంతమంది వైద్యులు ఉన్నారు? వారందరిని వదిలేసి పంటిని తీయించుకోవటం కోసం ఢిల్లీకి వెళ్లాలా? ఇదంతా పంటి వైద్యుల్ని అవమానించినట్లు కాదా? అని కూడా అనేవారేమో? కేసీఆర్ తరహా ఉద్యమ నేతలు లేకపోవటం కేసీఆర్ లక్ గా చెప్పాలి.

ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి హైదరాబాద్ వైద్యుల వద్ద వైద్యం తీసుకోవటానికి విమానాల్లో వచ్చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్లి వైద్యం చేయించుకోవటం చూస్తే.. ఈ సిత్రాలన్ని మీకే సరిపోతాయేమో? అన్న భావన కలుగక మానదు.