Begin typing your search above and press return to search.

మిత్రుల తో ఈ మొండి తనం ఏంది మోడీ షా?

By:  Tupaki Desk   |   11 Nov 2019 5:27 AM GMT
మిత్రుల తో ఈ మొండి తనం ఏంది మోడీ షా?
X
మిత్రుల మధ్య మొండి తనం ఏ మాత్రం మంచిది కాదు. అది వారి మధ్య మిత్రత్వాన్ని దూరం చేయటమే కాదు.. కొత్త తల నొప్పుల్ని తీసుకొస్తుంది. వ్యక్తిగతం గా ఉండే మిత్రత్వానికే ఇన్ని చిక్కులు ఉంటే.. రాజకీయాల్లో మిత్రత్వం.. అందునా సుదీర్ఘ కాలంగా సాగిన మిత్రత్వాన్ని ముప్పు తెచ్చేలా మోడీ షాలు వ్యవహరిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఒకప్పుడు లోక్ సభ లో రెండంటే రెండు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ.. ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నదంటే దానికి కారణం బీజేపీ మాత్రమే కాదు.. దాని సిద్దాంతాలు.. ఆదర్శాల కు బలమైన వాణి గా నిలిచి.. అసలుసిసలు స్నేహితుడి గా నిలిచిన శివసేన ను మర్చి పోలేం.

రాజకీయాల్లో సుదీర్ఘ మిత్రత్వం అంత తేలికైన విషయం కాదు. అందునా.. మిత్రుడి విషయం లో ఉదారం గా ఉండాల్సిన దానికి భిన్నంగా మోడీ షాలు ఉండటం కొత్త విషయమేమీ కాదు. అయినప్పటి కీ నొచ్చుకొని కూడా బీజేపీ తో బంధం సాగిస్తున్న పాత మిత్రుడిగా శివసేన ను చెప్పాలి. ఇటీవల మహారాష్ట్ర లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పార్టీలు కలిసి ఉమ్మడి గా పోటీ చేయటం.. ఫలితాలు వీరి కూటమికి అనుకూలం గా రావటం తెలిసిందే.

అయితే.. అధికారాన్ని 50-50 ప్రాతిపదికన పంచుకోవాలని.. తమకే ముఖ్య మంత్రి కుర్చీ ఇవ్వాలని కోరటం ద్వారా బీజేపీ అధి నాయకత్వాని కి ఆగ్రహం కలిగేలా చేసింది శివ సేన. ఎంతకూ తగ్గని సేన డిమాండ్ పై సానుకూలంగా స్పందించేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. దీంతో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాలు దాటినా మహారాష్ట్ర రాజకీయం ఒక కొలిక్కి రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.

తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా లేని వేళ.. స్నేహితుడితో సంధి చేసుకోవటానికి సిద్ధంగా లేని కమలనాథుల మైండ్ సెట్ తో కొత్త ముప్పు ఇప్పుడు ఎదురుకానుంది. ముఖ్యమంత్రి పదవిని తాము సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న శివసేన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన బలాన్ని సమ కూర్చుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నిస్తోంది. సుదీర్ఘ కాలంగా స్నేహితుడి గా ఉన్న శివసేన డిమాండ్ కు తలొగ్గి ఉండి ఉంటే.. ఈ పాటికి శివసేన ప్రభుత్వం కొలువు తీరి ఉండేది.

కానీ.. అందుకు భిన్నంగా బీజేపీ అధినాయకత్వపు ఆలోచనలు ఉండటంతో ఇప్పుడు ఉత్కంఠ వ్యక్తమవుతోంది. సేనకు సర్కారు పగ్గాలు అప్పగించే విషయంలో మోడీ షాలు మొండితనంతో వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతకూ వెనక్కి తగ్గని కమలనాథుల మొండితనం సుదీర్ఘకాలంగా స్నేహితుడిగా ఉన్న శివసేనను దూరం చేయనుందా? అదే జరిగితే బీజేపీ కి అంతటి నమ్మకమైన మిత్ర పక్షం దొరకటం అంత ఈజీ కాదన్నది మర్చిపోకూదు. మిత్రుడి కోసం అధికారాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా లేని మోడీషాల కారణంగా ఏ తరహా రాజకీయాలు తెర మీదకు వస్తాయో కాలమే చెప్పాలి.