Begin typing your search above and press return to search.

వారాహి + ప‌వ‌న్ ఎన్నిక వ్యూహం ఏంటి..!

By:  Tupaki Desk   |   17 Dec 2022 2:30 AM GMT
వారాహి + ప‌వ‌న్  ఎన్నిక వ్యూహం ఏంటి..!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ్యూహం ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎలా గెలుస్తారు? ఎలా నిలుస్తా ? అంటే.. వెంటనే ఎలాంటి త‌డ‌బాటు లేకుండా.. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్న ఏకైక మాట‌.. వారాహి ఉందిగా!! అనే. అంటే.. వ‌చ్చే ఎన్నికల్లో విజయం ద‌క్కించుకునేందుకు వారాహి వాహ‌నం ద్వారా ప్ర‌చారం చేయ‌డ‌మే ల‌క్ష్య‌మా? అనే సందేహాల‌కు తావు వ‌స్తుంది. అయినా స‌రే.. ఆ పార్టీ నేత‌లు మాత్రం ఔన‌నే అంటున్నారు.

వాస్తవానికి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ త‌ర‌ఫున నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జులు కూడా లేరు. ఇక‌, పార్టీ బాధ్యులు లేనే లేరు. బూత్ స్థాయిలో క‌మిటీల ఊసు కూడా వినిపించ‌డం లేదు. అంటే.. ఒక పార్టీ విజ‌యం ద‌క్కించుకు నేందుకు ఉండాల్సిన క‌నీస ప‌రిస్థితి.. క‌నీస వ్యూహాలుక‌నిపించ‌డం లేద‌న్న‌మాట‌. అయినా.. కూడా పార్టీ విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చేయాల‌నేదే.. ప్ర‌ధాన పెద్ద వ్యూహం.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వారాహి+ ప‌వ‌న్ మాత్ర‌మే జ‌న‌సేన‌కు వ్యూహంగా మారాయ‌న్న మాట‌!ఇంత‌కు మించి పార్టీ నుంచి ఎలాంటి కాన్సెప్టులు క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఇత‌ర పార్టీల విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఒక పార్టీకి మించి మ‌రో పార్టీ వ్యూహాలు వేస్తున్నాయి. బూత్ స్థాయి నాయ‌కుల‌ను అలెర్ట్ చేస్తున్నాయి.

క్షేత్ర‌స్థాయిలో ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసేలా కూడా వ్యూహా త్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. అలాంటి ప‌రిస్థితి జ‌న‌సేన‌లో మాత్రం క‌నిపించ‌డం లేదు. దీనివ‌ల్ల‌.. పార్టీపై ప్ర‌భావం చూపుతుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిజాయితీగా రాజ‌కీయాలు చేసి.. భ‌విష్యత్తులో ఏదో కావాల‌ని భావించే నాయ‌కుల‌కు ఇది ఇబ్బంది క‌ర‌మైన ప‌రిణామంగా చెబుతున్నారు ప‌రిశీల‌కులు.సో.. కేవ‌లం వారాహి+ప‌వ‌న్ మంత్రంతో అధికారం ద‌క్కేనా? అనేది ప్ర‌శ్న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.