Begin typing your search above and press return to search.

మే 19.. జగన్ ఏం చేయబోతున్నారు?

By:  Tupaki Desk   |   9 May 2019 7:19 AM GMT
మే 19.. జగన్ ఏం చేయబోతున్నారు?
X
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 23న ఫలితాలు.. అయితే అందరి చూపు మాత్రం మే 19నే ఉంది. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగానే దేశంలోని ప్రఖ్యాత మీడియా సంస్థలు, వివిధ సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తిస్తాయి. ఏపీలో ఇప్పటికే వైసీపీ గాలి వీస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే మే 19పైనే ఫుల్ ఫోకస్ పెట్టారట వైసీపీ అధినేత జగన్..

చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. అధికారం కోసం ఎంతకైనా తెగించే రకమని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. 2014లో గెలిచిన 20మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగారు. అందుకే ఏకపక్షంగా గెలిస్తే వైసీపీకి ఢోకాలేదు. అదే మేజిక్ ఫిగర్ కు ఐదు, పది ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వస్తే మాత్రం గందరగోళం సృష్టించడం ఖాయం.. అధికారం కోసం ఎంతకైనా దిగజారే బాబు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అంత తేలికగా కాదని వైసీపీ శిభిరం అనుమానిస్తోంది.. అందుకే ప్రతిపక్షనేత జగన్ మే 19న టార్గెట్ ఫిక్స్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలందరినీ ఒక్కచోటకు చేర్చే బాధ్యతను కీలక నేతలను అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రతి జిల్లాకు సీనియర్ నేతను ఎంపిక చేసే గెలిచే వైసీపీ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించే బాధ్యతను అప్పగించినట్టు సమచారం.. మే 19న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను కాపాడుకొని మే 23 వరకూ ఉంచుకోవాలని.. ఫలితాల తర్వాత ఏం జరిగినా వైసీపీ దెబ్బపడకుండా కాచుకోవాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.

ఇలా బాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జగన్.. ఈసారి అధికారం మిస్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ గెలిచినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పోయినసారి లాగే ఎమ్మెల్యేలను లాగే కుట్రను బాబు చేయొచ్చని వైసీపీ అనుమానిస్తోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మే 19నే ఎమ్మెల్యే అభ్యర్థులను క్యాంప్ నకు తరలించాలని జగన్ స్కెచ్ గీసినట్టు సమాచారం.