Begin typing your search above and press return to search.

ఏందిది.. కేసీఆర్‌.. ఇలా చేయొచ్చా? నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల వ‌ర్షం

By:  Tupaki Desk   |   21 Jun 2021 9:35 AM GMT
ఏందిది.. కేసీఆర్‌.. ఇలా చేయొచ్చా?  నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల వ‌ర్షం
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆదేశాల‌తో పోలీసులు రెచ్చిపోయారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టులు చేశారు. ఈ రోజు ఉద‌యం 6 గంటల నుంచే నాయ‌కుల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకున్నారు. చాలా మందిని హౌస్ అరెస్టు చేయ‌గా.. మ‌రికొంద‌రు నిన్న రాత్రి త‌మ స్నేహితులు, బంధువుల ఇళ్ల‌లో త‌ల‌దాచుకుని ఈ రోజు ఉద‌యం రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ఇలా రోడ్ల మీద‌కు వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పోలీసులు అరెస్టులు చేసి.. స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.

ఈ ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌తిప‌క్ష నేత‌లు స‌హా.. నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ``కేసీఆర్ ఏందిది.. ఇలా చేయొచ్చా? ఇది న్యాయ‌మేనా?`` అంటూ.. నిప్పులు చెరుగుతున్నారు. మ‌రికొంద‌రు .. మీరు కూడా ఉద్య‌మ నేత‌గానే రాజ‌కీయాల్లో గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే ఉద్య‌మాల‌పై ఉక్కుపాదం మోపుతారా? అని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. దీంతో కేసీఆర్ స‌ర్కారుకు ఊపిరి ఆడ‌డం లేదు. ఈ ప్ర‌శ్న‌ల‌పై కానీ, నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై కానీ.. టీఆర్ ఎస్ నేత‌లు. ఎవ‌రూ స్పందించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ కూడా మౌనంగా ఉంటున్నారు.

ఇంత‌కీ.. ఏం జ‌రిగింది.. ఎందుకు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.. అనే విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. తాజాగా రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత‌.. సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ జిల్లాలో అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకు స్థాప‌న‌లు చేయ‌నున్నారు. అదేవిధంగా ఇప్ప‌టికే పూర్త‌యిన ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్నారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు.. సీఎం కేసీఆర్ను క‌లుసుకునేందుకు, ఆయ‌న‌కు ప‌లు అంశాల‌పై విన‌తి ప‌త్రాలు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాయి. మ‌రికొంద‌రు ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై నిల‌దీయాల‌ని అనుకున్నారు.

అయితే.. కేసీఆర్ ఆదేశాల‌తో ముందుగానే అలెర్ట్ అయిన పోలీసులు వ‌రంగ‌ల్ జిల్లా మొత్తాన్ని త‌మ అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ ప‌ర్య‌టించే ప్రాంతాల్లో ముందుగానే దుకాణాల‌ను బంద్ చేయించారు. సెక్ష‌న్ 144 విధించారు. నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేశారు. దీంతో నెటిజ‌న్లు రెచ్చిపోయారు. కేసీఆర్ టార్గెట్‌గా నిప్పులు చెరుగుతున్నారు.