Begin typing your search above and press return to search.
ఉద్యమ వేళలో నాన్న చెప్పిందే ఇప్పుడు కొడుకు చెబుతున్నాడు
By: Tupaki Desk | 8 Oct 2022 5:18 AM GMTమూస ధోరణిలో.. అలవాటైన ఫార్ములాలో సినిమాలు తీస్తే ఏమవుతుంది? ఇప్పుడు రొడ్డు మాటల్నే చెబుతున్నారు గులాబీ బాస్.. ఆయన కుమారుడు కేటీఆర్. గతంలో తాము చెప్పిన మాటల్ని అదే పనిగా చెప్పి.. ఆ తర్వాత ప్లేట్ ఎలా ఫిరాయిస్తారో కోట్లాది మంది చూసిన తర్వాత కూడా.. ఆ ఫార్ములాను ప్రజలు గుర్తిస్తారన్న సోయి లేకుండా.. అదే మాటల్ని చెప్పేస్తున్న తండ్రికొడుకుల తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర సాధన వేళలో గులాబీ బాస్ కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూసినప్పుడు.. ఎంతసేపటికి తెలంగాణ సమాజానికి జరుగుతున్న మోసం.. దుర్మార్గాల్ని చెప్పటంతో పాటు..తన కలల తెలంగాణను ఆవిష్కరించటమే తన లక్ష్యమని.. తనకు అధికారం అక్కర్లేదన్న మాట చెప్పేవారు.
ఆ తర్వాత ఏం జరిగిందో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి తెలుసు. కష్టపడి సాధించిన తెలంగాణను.. ఎవరో చేతికి ఇస్తే ఆగమాగం అయిపోతుందన్న మాట చెప్పేయటమే కాదు.. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని.. తేడా వస్తే తన తల కోసుకుంటానని చెప్పిన వైనాన్ని పదే పదే చెప్పటం తెలిసిందే.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తూ నిర్ణయం తీసుకున్న వేళ.. తాము మోడీ పాలన గుట్టు విప్పటమే తప్పించి.. మరింకేమీ ఆలోచన లేదని.. ప్రధాని పదవి కోసం కాదంటూ సీఎం కేసీఆర్ నోటి నుంచి రావటం తెలిసిందే.
తన తండ్రి చెబుతున్న మాటల్నే ఇప్పుడు మంత్రి కేటీఆర్ అదే పనిగా వల్లె వేస్తున్నారు. అధికారం.. పదవుల కోసం తన తండ్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదని.. గోల్ మాల్ గుజరాత్ మోడల్ గుట్టు రట్టు చేసి.. తెలంగాణ ప్రగతి నమూనాను దేశమంతటికి విస్తరించేందుకు వెళుతున్నట్లు చెబుతున్నారు.
అయితే.. ఇలాంటి మాటలు చెప్పే వేళలో.. సీఎం కేసీఆర్ కానీ ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కానీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలన్న మాట వినిపిస్తోంది. తాము చెప్పే మాటలన్ని గతంలోనూ చెప్పామని.. ఒకసారి సక్సెస్ అయిన ఫార్ములా మరోసారి సక్సెస్ కాదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ అయితే పెద్ద వయసుతో పాటు.. తన మీద తనకుండే నమ్మకం.. తన మేధస్సుతో తిమ్మిని బొమ్మిని చేయొచ్చన్న భావన ఉండొచ్చు.
ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో అన్ని విషయాలు అందరికి తెలిసి పోతున్న వేళ.. పాత వ్యూహాన్ని కాస్తంత మార్చుకుంటే మంచిది. లేదంటే.. మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని తండ్రికొడుకు గుర్తించాలన్న సూచన పలువురి నోట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.