Begin typing your search above and press return to search.
రాత్రి వేళ ఎంపీ అభ్యర్థుల చెవిలో కేసీఆర్ ఏం చెప్పారంటే?
By: Tupaki Desk | 10 April 2019 5:01 AM GMTఎన్నికల ప్రచారం ముగిసి.. పోలింగ్ వ్యూహాలకు పదును పెడుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎంపీ అభ్యర్థులతో సోమవారం రాత్రి ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏంపీ అభ్యర్థులకు.. ముఖ్యమంత్రికి మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ సాగిన ఎన్నికల ప్రచారం.. వారి దృష్టికి వచ్చిన అంశాలతో పాటు.. తాను గమనించిన విషయాల్ని వారితో పంచుకున్నట్లుగా సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మించినట్లుగా ఎంపీ ఎన్నికల్లోనూ ఫలితాలు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్.. బీజేపీలకు ఘోర పరాజయం తప్పదన్న మాట ముఖ్యమంత్రి నోట వచ్చినట్లుగా తెలుస్తోంది. సర్వేలన్నీ టీఆర్ ఎస్ కు సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
స్థానికంగా ఉన్న పాజిటివ్.. నెగిటివ్ అంశాలను అభ్యర్థుల నుంచి అడిగి తెలుసుకున్న కేసీఆర్.. కీలకమైన పోల్ మేనేజ్ మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. తాను ముందు నుంచి చెబుతున్నట్లుగా 16 స్థానాల్ని టీఆర్ ఎస్ కు కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందన్న విషయంతో పాటు.. సంక్షేమ పథకాల అమలు తమకు మేలు చేశాయన్న మాట కేసీఆర్ నోట వచ్చినట్లుగా తెలుస్తోంది.
కీలకమైన ఎన్నికల పోలింగ్ వేళ అభ్యర్థులు వ్యవహరించాల్సిన అంశాలను కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. అభ్యర్థులకు చెక్ లిస్గ్ మాదిరి చెప్పిన కేసీఆర్.. పార్టీ యంత్రాంగం సమర్థంగా పని చేసిందని.. రానున్న రెండు రోజులు ఏ మాత్రం ఏమరపాటు వద్దని చెప్పినట్లు తెలిసింది. నేతలు.. కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్లాలన్న సూచనతో పాటు.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ ముగిసే వరకూ ప్రజల్లోనే ఉండాలన్నారు.
పార్టీ నేతలు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్న విషయాన్ని నొక్కి చెప్పినట్లుగా తెలుస్తోంది. నిబంధనల్ని ఎక్కడా మీరొద్దని.. ఏదైనా వివాదాలు ఉంటే అధికారుల చేతుల్లోకి వెళ్లి పరిష్కరించుకోవాలన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది. అధినేత నుంచి భరోసా.. విజయానికి సంబంధించిన ధీమా మాటలు ఎంపీ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపటమే కాదు.. పోలింగ్ క్రతువును సమరోత్సాహంతో పూర్తి చేసేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. ఎప్పుడేం చేస్తే ఏం జరుగుతుందో కేసీఆర్ కు తెలీదా?