Begin typing your search above and press return to search.

నష్టపోయిన ఆర్యన్ ఖాన్ కు ఎలాంటి పరిహారం ఎలా చెల్లిస్తారు..?

By:  Tupaki Desk   |   28 May 2022 8:33 AM GMT
నష్టపోయిన ఆర్యన్ ఖాన్ కు ఎలాంటి పరిహారం ఎలా చెల్లిస్తారు..?
X
ముంబై సమీపంలో క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ వినియోగించాన్న అభియోగంపై షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పై కేసు నమోదు చేసి పోలీస్ కస్టడీకి పంచించారు. ఆ తరువాత బెయిల్ పై బయటికి వచ్చిన ఇన్ని రోజుల తరువాత ఆర్యన్ ఖాన్ కు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగించలేదని తేలింది.

అయితే తనకు జరిగిన అవమానం పై నష్టపరిహారం చెల్లిస్తారా..? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. భారతీయ రాజ్యాంగం ప్రకారం తప్పుడు జైలు శిక్ష ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనికి పరిహారం ఇచ్చి సరిపుచ్చుతారని కొందరు అంటున్నారు. మరి ఆర్యన్ ఖాన్ విషయంలో ఎలాంటి పరిహారం అందించబోతున్నారు..?

2021 అక్టోబర్ 2న ముంబైలోని క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ జరిగింది. ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.

ఇందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉన్నట్లు ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. దీంతో ఆయనను కోర్టుకు హాజరుపర్చడంతో 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే దాదాపు 20రోజులు జైలులు ఉన్న తరువాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించింది.

ఈ కేసుపై విచారిస్తున్న సమయంలో కీలక సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అకస్మాత్తుగా మరణించాడు. అయితే ఆయన మృతిపై ఎవరూ అనుమానం వ్యక్తం చేయకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నుంచి విచారిస్తున్న ఎన్సీబీ చివరికి 14 మందిపై నేరారోపణలు చేసింది. కానీ ఇందులో ఆర్యన్ ఖాన్ పేరు లేదు. ఛార్జీషీట్లో పేర్కొన్న వారికి డ్రగ్స్ తో సబంధం ఉందని తెలపింది. కానీ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు దొరకలేదని ఎన్సీబీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్సీబీ అధికారి సంజయ్ కుమార్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ పై ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారని అప్పట్లో కొందరు ఆరోపించారు. కానీ పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని ఎన్సీబీ తెలిపింది. కానీ తాజాగా ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చీట్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా 20 రోజుల పాటు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ కు ఎలాంటి నష్టపరిహారం అందిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. భారతీయ రాజ్యాంగం ప్రకారం తప్పుడు జైలు శిక్ష విధించడం ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేయడమే. ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాల్లో పరిహారం పొందే విషయంలో చట్టబద్దమైన హక్కును రూపొందించాయి. కానీ మనదేశంలో ఇంతగా లేకున్నా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అతని పర్సనల్ వ్యవహారంలో భాగంగానే ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేశారని మహారాష్ట్రకు చెందిన కొందరు విమర్శించారు. అప్పట్లో తమ వద్ద ఆధారాలున్నాయని సమీర్ తెలిపారు. కానీ ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చీట్ ఇవ్వడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.