Begin typing your search above and press return to search.
రోజాకు కేసీఆర్ ఫోన్ చేశారంటే.. సారు వర్కులోకి దిగినట్లేనా?
By: Tupaki Desk | 24 April 2021 9:30 AM GMTకరోనా బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకోవాలని.. ఆయనకు స్వస్థత చేకూరాలని పూజలు.. యాగాలు.. ఇలా ఎవరికి వారు.. తమకు తోచిన రీతిలో రియాక్టు అయ్యారు. స్వల్ప లక్షణాలు కనిపించటంతో ఫాంహౌస్ లోని హోంఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. వైరస్ లోడ్ తక్కువగా ఉండటం.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అందించే చికిత్స.. చేసే ఏర్పాట్ల నేపథ్యంలో ఆయన త్వరగానే కోలుకున్నారని చెప్పాలి. రోగ తీవ్రత తక్కువగా ఉన్న తర్వాతే యశోదాకు వచ్చి.. సిటీస్కాన్ తీయించుకున్నారు.
అప్పటికే ఆయనకు కరోనా తీవ్రత తగ్గిందని.. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకోవటంతో పాటు.. సీఎం రోజువారీగా నిర్వహించాల్సిన బాధ్యతల్ని నిర్వహిస్తారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు స్పష్టం చేయటం తెలిసిందే. దీనికి తగ్గట్లే.. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన తాను బాగున్న సందేశాన్ని తనదైన రీతిలో పంపారని చెప్పాలి.
ఇటీవల ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించకున్న సినీనటి కమ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఫోన్ చేశారు. ఆపరేషన్ అనంతరం చెన్నైలోనే ఉంటూ చికిత్స పొందుతున్న రోజా ఆరోగ్యం గురించి ఆరా తీయటంతో పాటు.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓపక్క కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలని పెద్ద ఎత్తున తపిస్తున్న వేళ.. ఆయనే మరొకరి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన వైనాన్ని చూస్తే.. ఆయన ఆరోగ్యం మామూలుగా మారటంతో పాటు.. తానిప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అన్న సందేశాన్ని చెప్పకనే చెప్పినట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. ఆయన రోజువారీ పనిని మొదలు పెడినట్లుగా చెప్పక తప్పదు.