Begin typing your search above and press return to search.
ఊళ్లకు పంపిస్తామన్న మాటతో అక్కడెలాంటి పరిస్థితి అంటే?
By: Tupaki Desk | 26 July 2020 4:50 AM GMTసొంతూరు మీద ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. అందునా కరోనా కాలంలో ఊరి కాని ఊళ్లో ఉన్నప్పుడు సొంతూరు ఇట్టు గుర్తుకు వచ్చేస్తుంది. మనసు ఎంత పీకుతున్నా.. ఊరికి వెళ్లలేని లాక్ డౌన్ పరిస్థితుల్లో ఊరికి పంపుతామన్న మాటకు వచ్చే స్పందన తాజాగా చూసిన అధికారులు తలలు పట్టుకోవటమే కాదు.. ఊరుకు వెళ్లిపోవాలన్న ఆత్రుతతో అసలు ప్రమాదాన్ని లెక్క చేయని వైనం షాకింగ్ గా మారింది.
ఫిలిప్పీన్ దేశ రాజధాని మనీలా. మిగిలిన మహానగరాల్లో మాదిరే మనీలాను కరోనా కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. దీంతో.. జనం ఊసుకుమనుకుంటున్న పరిస్థితి. నగరాన్ని విడిచి ఊరికి వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం లేకపోవటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇలాంటివేళ.. రాజధాని నగరం నుంచి సొంతూళ్లకు పంపుతామని అధికారులు ఒక ప్రకటన చేశారు. అంతేకాదు.. అలా వెళ్లాలనుకునే వారు తొలుత కరోనా పరీక్ష చేసుకోవాలన్న రూల్ పెట్టింది.
అధికారుల నుంచి ప్రకటన వచ్చిందో లేదో.. వారు చెప్పినట్లుగా పరీక్ష కోసం స్థానికంగా ఏర్పాటు చేసిన బేస్ బాల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. దాదాపు పది వేల మంది స్టేడియంకు పోటెత్తటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇలా వచ్చిన వారిలో చిన్నారుల నుంచి పెద్ద వయస్కులే కాదు.. గర్భిణిలు కూడా ఉండటం గమనార్హం. సొంతూళ్లకు వెళ్లాలంటే.. అక్కడ జరిపే పరీక్ష తప్పనిసరి కావటంతో స్టేడియంకు పోటెత్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు పూసుకు రాసుకు తిరగటమే కాదు.. భౌతిక దూరాన్ని గాలికి వదిలేశారు. ముఖానికి మాస్కులు కూడా ధరించలేదు. సొంతూళ్లమీద జనాలకున్న మక్కువ.. కరోనా వేళ అక్కడికి వెళితే ఎలాగో బతికేస్తామన్న ధీమాతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్న నమ్మకం ఇలాంటి పరిస్థితి కారణమంటున్నారు.