Begin typing your search above and press return to search.
ఎవరీ మస్రత్ ఫారూక్.. కశ్మీర్ కు సరికొత్త స్ఫూర్తి కెరటం
By: Tupaki Desk | 17 Jun 2022 12:30 AM GMTకశ్మీర్ అన్నంతనే మంచు శిఖరాలు.. ప్రకృతి అందాలు.. కళ్లు తిప్పుకోలేని రమణీయత.. వీటితో పాటు ఏళ్లకు ఏళ్లుగా ఉగ్ర కాష్ఠం.. ఇలాంటి అనుభూతులెన్నో కలగలిపి వచ్చేస్తాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఏ క్షణానికి ఏ ముప్పు వాటిల్లుతుందో అర్థం కానట్లుగా ఉండే ఈ లోయ మొత్తం.. అణుబాంబును అరచేతిలో పెట్టుకున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి కశ్మీరంలో ఒక యువతి చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వటంతో పాటు.. పరికొత్త కశ్మీరానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. కశ్మీర్ విద్యా రంగంలో తొలి మహిళా ఎంట్రప్రెన్యూర్ గా ఆమె కొత్త బాటలు వేస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు? ఆమె పేరేమిటంటే.. మస్రత్ ఫరూక్.
కశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ లో ఆమెకు మాస్టర్ జీ అన్న పేరుంది. 26 ఏళ్ల ఈ యువతి వినూత్నంగా ఆలోచించి.. విద్యా రంగంలో ఇప్పటివరకు అక్కడ లేని సరికొత్త వసతిని తెర మీదకు తీసుకొచ్చారు. పిల్లలకు అవసరమైన ట్యూషన్ ను ఆమె ఏర్పాటు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ట్యూషన్లకు బ్రాండ్ అంబాసిడర్ కావటమే కాదు.. దాదాపు వంద మంది టీచర్ల ఉపాధికి కీలకమయ్యారు. నిత్యం ఏదో ఒక కలకలంతో చదువుల మీద ఫోకస్ చేయలేని పిల్లలకు.. ఇంటి వద్దకే వచ్చి పాఠాలు చెప్పేందుకు వీలుగా ఆమె ప్రయత్నాలు షురూ చేశారు.
శ్రీనగర్ లోని ఈద్గా ప్రాంతంలో పుట్టి పెరిగిన మస్రత్ తాను పదో తరగతి చదివే రోజుల నుంచి తన ఇరుగు పొరుగు వారికి ట్యూషన్లు చెప్పేది. క్లినికల్ సైకాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆమెకు.. అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు కొత్తగా ఆలోచించేలా చేశాయి.
మోడీ సర్కారు ఆర్టికల్ 370 రద్దు చేసి నేపథ్యంలో అక్కడి స్కూళ్లు మూతబడటం.. పిల్లలు ఇళ్లకే పరిమితం కావటం తెలిసిందే. అనంతరం కొవిడ్ కష్టాల గురించి తెలిసిందే. ఇంట్లో నుంచి అడుగు తీసి అడుగు బయటకు పెట్టలేని పరిస్రథితి. ఇలాంటి వేళ.. ఇంట్లో ఉండి చదువుకునే పిల్లలకు.. దాని మీద ఫోకస్ చేయలేని పరిస్థితుల్ని గుర్తించిన ఆమె.. ఇంటి వద్దకే బడి వెళ్లాలన్న ఆలోచనను చేసింది.
హోం ట్యూషన్ల కశ్మీర్ వ్యాలీలో షురూ చేసింది. ఇందులో భాగంగా వివిధ సబ్జెక్టుల్ని బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయుల కోసం ఆమె ప్రకటనలు ఇచ్చి.. వారిలో సమర్థుల్ని ఎంపిక చేసి.. ట్యూషన్లకు పంపటం మొదలు పెట్టింది. ప్రస్తుతం శ్రీనగర్ లోనే ఆమె వద్ద 80 మంది టీచర్లు ట్యూషన్ మాష్టార్లుగా పని చేస్తున్నారు. ఆమె చేసిన ప్రయత్నంతో కశ్మీర్ వ్యాలీలోని విద్యార్థులకు విద్యను అభ్యసించటానికి వీలుగా కొత్త మార్గం లభించినట్లైంది.
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలకు ట్యూషన్లు చెప్పే మస్రత్ టీంలోని వారికి.. ఆదాయం కూడా బాగానే లభిస్తోంది. ఆమె టీంలోని కొందరికి నెలకు రూ.50వేల చొప్పున ఆదాయం లభించటం గమనార్హం. మస్రత్ పుణ్యమా అని.. శ్రీనగర్ తో పాటు కశ్మీర్ వ్యాలీలో విద్యా సుగంధం ఇప్పుడిప్పుడే మరింతగా వ్యాపిస్తోంది. ఇలాంటి వినూత్న ఆలోచనల్ని చేసినందుకు మస్రత్ ను అభినందించాల్సిందే.