Begin typing your search above and press return to search.

రైతు చ‌ట్టాల మాదిరిగానే రాజ‌ధాని కూడానా...!

By:  Tupaki Desk   |   22 Nov 2021 4:31 AM GMT
రైతు చ‌ట్టాల మాదిరిగానే రాజ‌ధాని కూడానా...!
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం ఏం చేస్తుంది? ఎలా ముందుకు సాగుతుంది? ఇప్పు డు ఈ చ‌ర్చే సోష‌ల్ మీడియాలోనూ.. రాజ‌ధాని గ్రామాలు.. రాజ‌ధాని చుట్టుప‌క్క‌ల జిల్లాల్లోనూ జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. దీనికి ఒక ప్ర‌త్యేక కార‌ణం ఉంది.

గ‌తంలో ఏపీ రాజ‌ధానికి చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీనే శంకుస్థాప‌న చేశారు. నిధులు కూడా ఇచ్చారు. అయితే.. ఇదంతా గతం.. ప్ర‌భుత్వం మార‌గానే.. రాష్ట్రంలో రాజ‌ధాని విష‌యం యూట‌ర్నం తీసుకుంది. మూడు రాజ‌ధానులు తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. రాజ‌ధాని అమ‌రావ‌తినే సాగించాల‌ని.. ఇక్క‌డ రైతులు ప‌ట్టుబ‌ట్టారు.

గ‌ల్లీ నుంచి డిల్లీ వ‌ర‌కు త‌మ ఆందోళ‌న‌ను సాగించారు.. పెద్ద‌ల‌ను క‌లుసుకున్నారు. మొక్కారు.. విజ్ఞ‌ప్తులు ఇచ్చారు.. అయితే.. కేంద్రం నుంచి ఉలుకు ప‌లుకు లేదు. పైగా... పార్ల‌మెంటులోనే.. రాజ‌ధాని విష‌యం రాష్ట్ర‌ప్ర‌భుత్వ ప‌రిధిలోనిద‌ని.. తేల్చి చెప్పారు. ఇంకేముంది.. ఈ ర‌గ‌డ మ‌రింత పెరిగింది.

ఇబ్బందిక‌ర ప‌రిస్థితికి చేరింది. రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ‌ధాని ఉద్య‌మంపై తీవ్ర‌స్థాయిలో ఉక్కుపాదం మోపింద‌ని.. రైతులు, ఉద్య‌మ‌కారులు ఆరోపించారు. అయిన‌ప్ప‌టికీ.. రైతులు ఉద్య‌మాన్ని కొన‌సాగించారు. ప్ర‌స్తుతం పాద‌యాత్ర చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు.. రాజ‌ధాని రైతులు, మ‌ద్ద‌తుదారులు.. రాష్ట్ర ప్ర‌జల్లో ఆస‌క్తిని రేకిస్తున్నాయి. ఆశ‌లు పెంచుతున్నాయి.

దీనికి కార‌ణం.. గ‌త ఏడాది కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌పై ఆది నుంచి మొండి వైఖ‌రిని అవ‌లంభించిన న‌రేంద్ర మోడీ.. ఢిల్లీలో రైతులు చేప‌ట్టిన ఉద్య‌మాన్ని అణిచేయాల‌ని ప్ర‌య‌త్నించార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతేకాదు..దీని వెనుక ఉగ్ర‌వాదులు ఉన్నారని, ఖ‌లిస్తాన్ తీవ్ర‌వాదులు ఉన్నార‌ని.. సంఘ విద్రోహ‌శ‌క్తులు ఉన్నాయ‌ని.. అస‌లు వీళ్లు రైతులే కార‌ని ఇలా.. అనే ఆరోప‌ణ‌లు చేశారు త‌ప్ప‌.. చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునేది లేద‌న్నారు. అయితే.. తాజాగా న‌రేంద్ర మోడీ వెన‌క్కి త‌గ్గారు. పార్ల‌మెంటులో చేసిన మూడు చ‌ట్టాల‌ను ఆయ‌న వెన‌క్కి తీసుకున్నారు. ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

దీంతో.. ఈ ప‌రిణామం.. రాజ‌ధాని రైతుల్లో ఆనందం పెల్లుబికేలా చేస్తోంది. రాజ‌ధాని విష‌యంలో ఇప్ప‌టివ ర‌కు త‌మ పాత్ర , ప్ర‌మేయం లేద‌ని చెబుతున్న మోడీ ప్ర‌భుత్వం.. త‌మ ఉద్య‌మం చూసి దిగి వ‌స్తుంద‌ని.. మ‌న‌సు మార్చుకుంటుంద‌ని.. అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా.. రాజ‌ధాని ఉద్య‌మాన్ని సానుకూలంగా తీసుకున్నార‌ని కాబ‌ట్టి.. త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప‌రిణామాల‌ను వైసీపీ నేత‌లు ఎలా చూస్తారో చూడాలి.