Begin typing your search above and press return to search.
మోహన్ బాబు, అలీల కు పదవులెందుకు దక్క లేదు?
By: Tupaki Desk | 16 Nov 2019 7:18 AM GMTరాజకీయాల కు, సినిమా ఇండస్ట్రీ కి విడదీయరాని బంధం ఉంటుంది. సినిమా తారలే రాజకీయాలను ఏలారు.. ఏలుతున్నారు. తెలుగు నాట ఎన్టీఆర్, చిరంజీవి, పవన్, తమిళనాట ఎంజీఆర్, జయలలిత, కమల్, రజినీ ఇలా రాజకీయాల్లో ముద్ర వేశారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సినీ తారలు రాజకీయాలను శాసించే స్థితి లో లేరు. ఆంధ్రా లో ఏదో ఒక పార్టీ లో చేరి పదవులు పొందుతున్నారు. సొంతంగా వచ్చిన పవన్ కళ్యాణ్ ను జనాలు ఆదరించలేదు..
ప్రస్తుతం అధికారం లో ఉన్న వైసీపీతో పోల్చితే టీడీపీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ బలం చాలా ఎక్కువ. కేవలం ఎన్నికల ముందు మాత్రమే వైసీపీ కి కొందరు సినీ తారలు జై కొట్టి ప్రచారం చేశారు. వైసీపీ లో అనాదిగా ఉన్న సినిమా తారలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎన్నికలకు ఇలానే కొద్ది రోజుల మందు చంద్రబాబు ను వ్యతిరేకించి వైసీపీ లో చేరారు సీనియర్ యాక్టర్ మోహన్ బాబు. ఇక జనసేన, టీడీపీ లో సీట్లు దక్కక జగన్ కు మద్దతు తెలిపారు అలీ. వీరిద్దరికీ ఏదైనా పదవి ఇస్తానని జగన్ నాడు హామీ ఇచ్చారు. అయితే రోజులు మారుతున్న వీరికి పదవుల పందేరం దక్కడం లేదు. ఇప్పటి కే ఫృథ్వీ, రోజా కు పదవులు ఇచ్చిన సీఎం జగన్.. తాజాగా ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి ని విజయ్ చందర్ అనే నటుడికి ఇచ్చి అందలమెక్కించారు.
ఈ పదవి మోహన్ బాబు లేదా అలీ కి ఇస్తారని.. కాకుండా పోసాని కైనా ఇస్తారని ప్రచారం సాగింది. కానీ వీరెవ్వరికి ఇవ్వకుండా తనతో పాటు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న విజయ్ చందర్ కు ఇచ్చి జగన్ తన గొప్ప మనసు ను చాటారు.
మోహన్ బాబు స్వయా నా జగన్ కు బంధువు అవుతారు.. ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా లేదా నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సి ఉన్నా జగన్ కేటాయించలేదు. ఇక అలీ ఎన్నికల ముందర టీడీపీలో సీట్లు దక్కక వైసీపీలో చేరి పదవులు హామీలు పొంది వైసీపీ తరుఫున ప్రచారం చేశారు. ఇక మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతుంటారు. వీరి ముగ్గురి ని కాదని.. వైసీపీ లో తన వెంట పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న ఫృథ్వీ, విజయ్ చందర్ లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
మోహన్ బాబు, అలీలకు పదవులు దక్కక పోవడం వెనుక వారు ఎన్నికల ముందుర మాత్రమే వైసీపీ లో చేరడమే కారణం గా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.. మొదటి నుంచి తనతో పాటు ఉన్న వారికి జగన్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారని అంటున్నారు. ఆ కోవలోనే ఎన్నికల ముందు చేరిన మోహన్ బాబు, అలీలకు పదవుల పందేరం లో జగన్ ఆలస్యం చేస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రాధాన్యత క్రమంలోనే సినీ ప్రముఖులకు జగన్ పదవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పార్టీ పెట్టినప్పటి నుంచి తన వెంట నడిచి కష్టపడ్డ వారికి ఫస్ట్ ప్రియారిటీ.. మొన్ననే చేరిన వారికి తరువాత ప్రియారిటీ లెక్కన ముందుకెళ్తున్నారట.. దీంతో భవిష్యత్తులోనే మోహన్ బాబు, అలీలకు పదవులు దక్కనున్నాయని అర్థమవుతోంది.. జగన్ తీసుకున్న ఈ పాలసీ పదవులు ఆశిస్తున్న వారికి మాత్రం నిరాశను కలిగిస్తుంది. కానీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రం గుర్తింపు లభిస్తుంది. మరి మోహన్ బాబు, అలీలకు పదవులు వస్తాయా రావా అన్నది వేచిచూడాలి.