Begin typing your search above and press return to search.
నాగబాబు చెప్పిన నిజం... జనసేన టీడీపీ పొత్తుకు ఫలితం...?
By: Tupaki Desk | 12 Jan 2023 4:12 AM GMTఏ రాజకీయ పార్టీ అయిన మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటే ఓట్ల కోసమే. ఇది ఫక్తు రాజకీయం. ఇక్కడ ఎవరూ ముక్కు మూసుకుని జపం చేయడానికి రారు. అలాగే పదవీ వ్యామోహం లేదని బయటకు చెప్పినా పదవుల కోసం పాకులాట తప్ప రాజకీయాల్లో మరేమీ ఉంటాయి అన్న ప్రశ్నలు వస్తాయి.
ఇక ఈ రాజకీయ వైకుంఠపాళీలో నిచ్చెనలు ఎన్నో పాములు ఎన్నో బాగా తెలిసిన వారు చంద్రబాబు. ఒక విధంగా ఆయన వైకుంఠపాళీని మొత్తం చూసారు. అంతటి అనుభవం ఆయనకు ఉంది. మరో వైపు రాజకీయమూ ఒక చదరంగమే. పావులు నప్పడంతోనే విజయం దక్కుతుంది. ఆ విషయంలోనూ బాబు పండిపోయారు. అలాంటి బాబు 2014లో జనసేనాని పవన్ని పక్కన పెట్టుకుని మరో వైపు మోడీ చరిష్మాను అడ్డం పెట్టుకుని విజయం దక్కించుకున్నారు.
అదే మ్యాజిక్ ని 2024 లో కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యమా అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది. పైగా రాజకీయాలు ప్రవహించే నది లాంటివి. అవి ఎపుడూ ఒకేలా ఉండవు. ఇక చూస్తే నాడు జగన్ కి అనుభవం తక్కువ. పైగా ఫస్ట్ టైం పోటీ చేసి ఉన్నారు. 2024 నాటికి మూడవసారి ఆయన తలపడతారు. నాటికీ నేటికీ మరో తేడా జగన్ అధికారంలో ఉన్నారు. నిండా బలంతో ఉన్నారు.
వైసీపీ కూడా సంస్థాగతంగా బలంగా ఉంది. బాబు ఎత్తులకు పై ఎత్తులు వేసే స్టేజిలో జగన్ ఉండడమే కాదు బాబు వేసే ఎత్తులన్నీ కూడా బాగా గ్రహించి ఉన్నారు. అందువల్ల ఈ రాజకీయ చదరంగంలో జగన్ ఆట కట్టించడం అంటే అంత సులువు కాదు. ఆ సంగతి బాబుకు తెలిసే జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఈ పొత్తు మీద విమర్శల దుమారం రేగుతోంది.
నిజానికి పొత్తులు దేశంలో అన్ని చోట్లా ఉంటాయి. అవి రాజకీయల్లో సహజమైనవే. కానీ ఏపీలో మాత్రం జనసేన టీడీపీ పొత్తు అంటే ఎపుడూ వివాదమే అవుతుంది. అలా వివాదాన్ని రాజేసి వారి పొత్తు అపవిత్రం, కాపుల ఓట్లు హోల్ సేల్ గా అమ్మేస్తున్న పవన్ అంటూ వైసీపీ దారుణమైన విమర్శలకు దిగిపోతుంది. ఒక విధంగా ఈ పొత్తు కుదిరినా ఫలితాలు లేకుండా రాకుండా చేయడమే ఆ పార్టీ సిసలైన రాజకీయ వ్యూహం. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు కేఏ పాల్ నుంచి రాం గోపాల్ వర్మ దాకా ఎవరెవరో కూడా జనసేన టీడీపీ పొత్తుల మీద విరుచుకుపడుతున్నారు.
ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా ఉంది. దాంతో కాపుల పార్టీగా జనసేనకు ముద్ర లేకపోయినా బలం బలగం అక్కడ నుంచే కాబట్టి తప్పనిసరిగా జవాబు ఇవ్వాల్సి వస్తోంది. మొదట తాము రియాక్ట్ కాకూడదని ఆ పార్టీ నేతలు అనుకున్నా అంతకంతకు అది పెరిగి కాపులలో అనుమానాలు పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో వివరణ ఇవ్వక తప్పడంలేదు.
అందుకే సీన్ లోకి మెగా బ్రదర్ జనసేన నాయకుడు నాగ్గబాబు వచ్చారు. ఆయన వస్తూనే ఆర్జీవీ మీద విరుచుకుపడ్డారు. నిజానికి ఆర్జీవీ కంటే ఘాటుగా కేవీ పాల్ కూడా వేయి కోట్లకు పవన్ అమ్ముడు పోయారు అని విమర్శలు చేశారు. కానీ సినీ బంధం కూడా ఆర్జీవీకి ఉండడంతో పాటు ఆయన ఇటీవల జగన్ని కలసి వచ్చారు, పైగా మెగా ఫ్యామిలీ అంటే ఎపుడూ ఏదో రకంగా విరుచుకుపడూంటారు కాబట్టి ఆయనే టార్గెట్ చేశారు నాగబాబు.
ఈ సందర్భంలో ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్తా ఆవేశంతో మాట్లాడారు నాగబాబు. అందులో నిజాలు కూడా అలా దొర్లుకుంటూ రావడమే విశేషం. ఆయన చెప్పాల్సింది ఒకటి అయితే చాలానే చెప్పేశారు. ఏపీ ప్రజలు ఎన్టీయార్ ని వైఎస్సార్ని జగన్ని ఎన్నుకున్నారని అంటూ వారికి ఎవరు ఇష్టమో వారికే ఓట్లు వేస్తారు తప్ప తాము చెప్పినట్లుగా వింటారా అని ప్రశ్నించారు. నిజంగా ఇది నాగబాబు రాజకీయ పరిణితిని సూచించే విషయంగానే చూడాలి.
అదే టైం లో కాపుల ఓట్లు అమ్మడానికి తాము ఎవరమని ఆయన అనడమూ మెచ్చతగిన విషయమే. తమకు ఆ హక్కు లేదంటూ ఒప్పుకోవడమూ కరెక్ట్ పాయింటే. తాము చెబితే ఎవరు వినరు అని ఆయన ఒప్పేసుకుని చెప్పేసుకోవడమూ మరో కీలక పాయింటే. ఇక్కడ నాగబాబు జనసేన నాయకుడు, ఒక రాజకీయ పార్టీ నేతగా కంటే కామన్ మ్యాన్ గానే రియాక్ట్ అయ్యారు. అంతకు మించి మెగా బ్రదర్ గా తన సోదరుడు పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న విష ప్రచారాన్ని ఖండించే విషయం మీదనే ఆయన అన్నీ చెప్పుకుని వచ్చారు.
దాంతో అసలు విషయాలు చాలానే ఆయన చెప్పారు అనుకోవాలి. తాము ఎవరమని ఆయన అనడం ద్వారా ఓటర్లు తెలివైన వారు అని ఒప్పుకున్నారు. ప్రజలు ఎవరిని నచ్చితే వారికే పట్టం కడతారు అన్నారు. మరి కాపుల విషయం తీసుకున్నా అదే నిజమైనపుడు జనసేనతో టీడీపీ కుదుర్చుకోబోయే పొత్తులకు ఫలితం ఉంటుందా ఉంటే ఎంత వరకూ ఉంటుంది అన్నది ఇపుడు ఆలోచించుకోవాల్సింది నాగబాబు కాదు చంద్రబాబు.
ఎందుకంటే కాపులు అంతా పవన్ చుట్టూ ర్యాలీ అవుతున్నారు అని ఆయన అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. పైగా ఈ పొత్తు విషయంలో చెలరేగుతున్న దుమారాలను కూడా చూస్తున్న చంద్రబాబు పొత్తును వదులుకోరు కానీ నాగబాబు వ్యాఖ్యల లాంటివే పరిగణనలోకి తీసుకుని జనసేనకు రాయబేరాల శక్తిని తగ్గించినా తగ్గిస్తారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.