Begin typing your search above and press return to search.

జగన్ ని కాపాడుతున్నదేంటి?

By:  Tupaki Desk   |   4 Nov 2019 12:07 PM
జగన్ ని కాపాడుతున్నదేంటి?
X
రాష్ట్రంలో కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ఐదు మాసాలు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్ పాల‌న‌పై ఎలాంటి వ్య‌తిరేక‌తా.. ఎక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌లేదు. అయితే, ఇటీవ‌ల రెండు మాసాలుగా రాష్ట్రంలో ఏర్ప‌డిన ఇసుక కొర‌త మాత్రం ప్ర‌భుత్వంపై ఒకింత వ్య‌తిరేక‌త పెంచింద‌ని విప‌క్షాలు చెబు తున్నారు. ఈ అంశంపైనే ఎడ‌తెగ‌కుండా టీడీపీ నాయ‌కులు ఆరోప‌ణ‌లు సంధిస్తున్నారు. ఏ విష‌యమూ దొర‌క‌క పోవ‌డంతో త‌మ్ముళ్లు ఈ విష‌యాన్ని ప‌ట్టుకునే వేలాడుతున్నారు. ఇక‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఇదే విష‌యాన్ని ప‌ట్టుకుని విశాఖ‌లో లాంగ్ మార్చ్‌కు పిలుపునివ్వ‌డం, నిర్వ‌హించ‌డం, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం జ‌రిగిపోయాయి.

అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఈ ఇసుక తుఫాన్ ఏమైనా చేస్తుందా? నిజంగానే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లు తోందా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. వీటిని ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం న‌దుల్లో నీరు ఉండ‌డం, ఇం కా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతుండ‌డంతో వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌కపోవ‌డంతో
ఇసుక లభ్య‌త‌పై ఇంకా ప్ర‌శ్న‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే, ఈ మాత్రానికే జగ‌న్‌కు బ్యాడ్ నేమ్ వ‌చ్చే స్తుందా? ఆయ‌న ప్ర‌భుత్వానికి ఈ మాత్రానికే ఇబ్బందులు చుట్టుముడ‌తాయా? అంటే.. అలాంటి దేమీ లేద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన అనేక అభివృద్ది సంక్షేమ కార్య‌క్ర‌మాలు, రివ‌ర్స్‌లో విజ‌యం వంటివి ఆయ‌న‌కు చిర‌స్థాయిని తీసుకువ‌చ్చాయ‌ని అంటున్నారు. ఉన్న ఊరిలో వీధికి ఒకట్రరెండు ఉద్యోగాలు సృష్టించడం జనాల్లో జగన్ కి బాగా పాజిటివిటీ పెంచింది. వివిధ ర‌కాల రోగుల‌కు ఇస్తున్న పింఛ‌న్ల‌ను భారీ ఎత్తున పెంచ‌డం కూడా క‌లిసి వ‌స్తోంది. వృద్ధులు, వితంతువుల‌కు కూడా పింఛ‌న్‌ను పెంచ‌డం ప్ల‌స్ అయింద‌ని అంటున్నారు.

అదే స‌మ‌యంలో నెల‌కో స‌రికొత్త కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ల‌క్ష‌ల సంఖ్యంలో ఉద్యోగాలు క‌ల్పించి దేశంలోనే రికార్డు సృష్టించారు. ఇక‌, త్వ‌ర‌లోనే అమ్మ ఒడి వంటి మ‌రో కీల‌క ప్రాజెక్టుకు శ్రీకారం చుట్ట‌నున్నారు. అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చి దిద్దుతున్నారు. ఇలా ఒక్కొక్కటి బలమైన పిల్లర్లు వేసుకుం టూ వెళ్తున్నారు. జగన్ చేస్తున్న పనులు కళ్ల ముందు కనపడటం అనేది మోస్ట్ పాజిటివ్ క్రియేట్ చేసింది.

ఈ నేపథ్యంలో ఇసుక మాత్రమే కాదు.. ఇప్పట్లో ఇంకో రెండు మూడు పెద్ద సమస్యలు వచ్చినా జగన్ ని కదిలించలేవ‌నేది వాస్త‌వం. ప‌బ్లిక్‌లోనూ ఇదే ట్రెండ్ న‌డుస్తోంది. మ‌రోప‌క్క‌, అవినీతి లేకుండా ప‌నులు చేయించ‌డం, రివ‌ర్స్ విష‌యంలో వేల కోట్ల‌ను ఆదా చేయ‌డం కూడా ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు మంచి మార్కులు ప‌డేలా చేశాయి. ఇలా చూస్తే.. ప్రాథ‌మికంగా ఇసుక విష‌యం విప‌క్షాలకు ఓ వ‌స్తువుగా ల‌భించినా.. రాబోయే రోజుల్లో వాటికి ప‌నుండే ఛాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.