Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా నష్టపోయింది ఇవే..!
By: Tupaki Desk | 11 March 2022 6:30 AM GMTయుద్ధం అనేది ఎవరు ఎవరితో చేసినా సరే.. నష్టం అనేది మాత్రం ఇద్దరూ మూట గట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే జరుగుతుంది. ఒక దేశం నష్టం ప్రత్యక్షంగా కనిపిస్తుంటే.. మరో దేశం నష్టం మాత్రం పరోక్షంగా భారీగా ఉంది. ఓ దేశ అధ్యక్షుడి పట్టుదలతో ప్రారంభమైన ఈ సమరంలో చాలా మంది సమిధలుగా మారారు. ఇంకా చెప్పాలి అంటే ఉక్రెయిన్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పుతిన్ ప్రారంభించిన ఈ సైనిక చర్యతో ఇరుదేశాలు భారీగానే నష్టపోతున్నాయి.
ఎన్నో దేశాల అధినేతలు యుద్ధం వద్దు అని వారించినా సరే వినకుండా పుతిన్ సైనిక చర్యకు మొగ్గు చూపారు. దీనిలో ఎక్కువ భాగం నష్టపోయింది మాత్రం రష్యానే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 12 వేల మంది రష్యా సైనికులు ఈ సైనిక చర్యలో ప్రాణాలు కోల్పోయారు.
నిజానికి రష్యా చేస్తున్న యుద్ధం కేవలం ఒక్క ఉక్రెయిన్ తో మాత్రమే కాదు. ప్రపంచ దేశాలతో అని చెప్ప వచ్చు. ఈ కారణంగానే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాయి. అంతేగాకుండా ఇప్పటికీ సాధ్యమైనన్ని ఆంక్షలను విధిస్తూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సంగతి అటుంచితే... రష్యా ఏకంగా పశ్చిమ దేశాలతో సంబంధం పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.
అందుకే దీనికి సంబంధించిన భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కొవడం అటుంచితే.. ప్రాణ నష్టం రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. ఇన్ని రోజులు అయినా కానీ ఉక్రెయిన్ రష్యా అధీనంలోకి రాలేదు అంటే దాని వెనక ఉన్న మతలబులు రష్యా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు.
ఉక్రెయిన్ ను గట్టిగా రెండు గంటల్లో తమ అధీనంలోకి తెచ్చుకుంటుందని ముందుగా రష్యా భావించింది. ఇలా ఉక్రెయిన్ ను తక్కువ అంచనా వేయడంతోనే రష్యా అన్ని విధాలా నష్టపోయింది. ముఖ్యంగా ఈ సైనిక చర్యలు ఉక్రెయిన్ చెప్తున్న దాని ప్రకారం 12 మంది రష్యా సైనికులు చనిపోయారు.
కేవలం వీరు మాత్రమే గాక సైన్యంలో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఉక్రెయిన్ చేతిలో మట్టికరిచారు. వీరిలో ఇద్దరు జనరల్ స్థాయి అధికారులు కాగా.. మరొకరు మేజర్ అని ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే రష్యాకు ఆయుధాల పరంగా కూడా భారీగా నష్టం వాటిల్లింది. అనేక మంది సైనికులు చనిపోయడంతో పాటు యుద్ధ విమానాలను కూడా ఉక్రెయిన్ సైన్యం కూల్చి వేసింది. అయితే వీటిలో అత్యంత ఖరీదైన ఫైటర్ జట్లు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్ చెప్పిన లెక్కల ప్రకారం సుమారు 49 ఫైటర్ జట్లను నేల కూల్చినట్లు చెప్తుంది.
వీటితో పాటు 80 హెలికాప్టర్లు, 30 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్, 300 లకు పైగా యుద్ధ ట్యాంకులు, 1100 ఆర్మీకి సంబంధించిన ఇతర వాహనాలను యుద్ధంలో మట్టికరిపించినట్లు తెలిపింది.
ఇలా అనేక స్థాయిల్లో రష్యాకు నష్టం వాటిల్లింది. అయితే మరో వైపు ఉక్రెయన్ కు పశ్చిమ దేశాలు వివిధ స్థాయిల్లో ఆయుధ సాయాన్ని అందించాయి. తుపాకుల దగ్గర నుంచి యుద్ధ విమానాల వరకు, హ్యాండ్ గ్రెనేడ్ దగ్గర నుంచి క్షిపణుల దాకా ఆయా దేశాలు సాయం చేశాయి.