Begin typing your search above and press return to search.

ఏం చేద్దాం? ఈడీ, సీబీఐ నోటీసులపై కేసీఆర్ తో కవిత భేటి?

By:  Tupaki Desk   |   3 Dec 2022 9:49 AM GMT
ఏం చేద్దాం? ఈడీ, సీబీఐ నోటీసులపై కేసీఆర్ తో కవిత భేటి?
X
ఓ వైపు ఈడీ రిమాండ్ రిపోర్ట్.. మరోవైపు సీబీఐ నోటీసుల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని ఆశ్రయించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం కవితకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో నమోదుచేసిన కేసులో దర్యాప్తు కోసం సీబీఐ ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో కానీ.. ఢిల్లీలో కానీ కవిత నివాసంలో విచారించాలని అనుకుంటున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు.

సీబీఐ నోటీసులు జారీ చేశారు. వారి అభ్యర్థన మేరకు ఈనెల 6వ తేదీన హైదరాబాద్ లోని మా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశా.. ఇంటివద్దే వారికి వివరణ ఇస్తానని కవిత శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ప్రగతి భవన్ కు వెళ్లడం సంచలనమైంది. తండ్రి కేసీఆర్ సలహాలు సూచనలు కోసం వ్యూహరచన చేసేందుకు కేసీఆర్ సీఎం నివాసం ప్రగతి భవన్ కు వెళ్లారు.

ఇక ఈ అంశంపై కవిత ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించినట్టు సమాచారం. సీబీఐ నోటీసులు, ఈ వ్యవహారంలో న్యాయపరంగా.. రాజకీయపరంగా ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలనే దానిపై కేసీఆర్ తో చర్చించేందుకు అవకాశం ఉంది.

ఓవైపు ఈడీ , మరోవైపు సీబీఐ నోటీసులు ఇవ్వడంతో న్యాయపరంగా.. రాజకీయంగా ఏం చేయాలన్న దానిపై.. ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై సీఎం కేసీఆర్ తో కవిత చర్చించనున్నట్టు తెలిసింది. నోటీసులకు తాను భయపడబోనని.. ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని కవిత చెప్పారు. వివరణ కోసం తనకు అందిన నోటీసులను బీజేపీ నాయకులు భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇక కవితకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఆమె నివాసం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. కవితను విచారించేందుకు వీళ్లేందంటూ సంఘీభావం తెలుపుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.