Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఇవ్వాలా ఏంది వారికి డ‌బ్బులు.. టీఆర్ఎస్ , బీజేపీ సార్లూ..?!

By:  Tupaki Desk   |   15 Nov 2021 8:32 AM GMT
కాంగ్రెస్ ఇవ్వాలా ఏంది వారికి డ‌బ్బులు..  టీఆర్ఎస్ , బీజేపీ సార్లూ..?!
X
అటు కేంద్ర ప్ర‌భుత్వం, ఇటు తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరు పై.. అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ప‌డుతోంది. ముఖ్యంగా సీజ‌న్‌ లో వ‌రి నాట్ల విష‌యం లో త‌లెత్తిన వివాదం.. వారికి ప్రాణ సంక‌టంగా మారింది. వ‌రి వేయొద్ద‌ని.. ఇప్ప‌టికే క‌లెక్ట‌ర్ల ద్వారా.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. మ‌రోవైపు దీని పై తీవ్ర వివాదం త‌లెత్తడం తో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించిన ప్ర‌భుత్వం.. తెలివి గా ఈ త‌ప్పు మాది కాదు.. కేంద్రానిదే.. అని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. రోడ్డెక్కి.. కేంద్రానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మించింది కూడా.

ఈ ఎపిసోడ్‌ లో చిత్రం ఏంటంటే.. అటు కేంద్రంలోని బీజేపీ కానీ.. ఇటు రాష్ట్రంలో టీఆర్ ఎస్‌ కానీ.. రైతుల విష‌యంలో ఎలాంటి బాధ్య‌త లేన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దేశంలో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. కేంద్రంలోని బీజేపీ నేత‌లు ప‌రిష్క‌రించాలి. అదేవిధంగా తెలంగాణ‌లో ఏదైనా స‌మ‌స్య త‌లెత్తితే.. అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ నాయ‌కులు ప‌రిష్క‌రించాలి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ.. కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంలోనే ఉంది. సో.. ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నేత‌లు కానీ.. చేసేది ఏమీ ఉండ‌దు.

అయితే.. రైతుల విష‌యం నుంచి జ‌లాల విష‌యం వ‌ర‌కు కూడా.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తూ.. కొట్టుకునే ప‌రిస్తితికి వ‌స్తున్నాయి. ఫ‌లితంగా రైతుల‌ను ఇబ్బంది పెడుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఒక‌వైపు క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే రైతులు.. తీవ్రంగా న‌ష్ట‌పోయారు. అదేస‌మ‌యంలో ఇత‌ర సాధార‌ణ జ‌నాలు కూడా తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ఉన్నారు. అయిన ప్ప‌టికీ.. కేంద్రం ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఏమీ ప‌ట్టించుకోలేదు. పైగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

పెట్రోల్ ధ‌ర‌ల‌నే తీసుకుంటే.. మీరే త‌గ్గించాలంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వ్యాఖ్యానించారు. పెంచుకుంటూ.. పోయింది మీరేన‌ని.. మీరు త‌గ్గించాల‌ని.. మేం పెంచ‌లేదు కాబ‌ట్టి.. త‌గ్గించే అంశం మా ప‌రిధిలో లేద‌ని.. ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. దీనిపై వెంట‌నే స్పందించిన బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.. అస‌లు పెట్రో ఉత్ప‌త్తుల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చేందుకు కేసీఆర్ ఎందుకు ఒప్పుకోలేద‌ని.. ఎదురు దాడి చేశారు. మేం జీ ఎస్టీ ప‌రిదిలోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తే.. కేసీఆర్ అంగీక‌రించలేద‌న్నారు. అంటే.. ఈ విష‌యంలో రెండు ప్ర‌భుత్వాలు..మాట‌ల యుద్ధం చేసుకున్నాయే త‌ప్ప‌.. స‌మ‌స్య‌ను మాత్రం ప‌రిష్క‌రించ లేక‌పోయాయి. ఫ‌లితంగా.. సామాన్యుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌లేదు.

ఇక‌, రైతుల విష‌యాన్ని తీసుకున్నా.. వ‌రి వేయాలా? వ‌ద్దా? అనే విష‌యం ఇప్ప‌టికీ సందిగ్ధంగానే ఉంది. వ‌రి వ‌ద్ద‌ని.. కేంద్రం చెప్పింద‌ని.. గిడ్డంగులు ఖాళీగాలేవ‌ని చెబుతోంద‌ని.. వ‌రిని సేక‌రించేది లేద‌ని కూడా కేంద్రం స్ప‌ష్టం చేసింద‌ని.. కేసీఆర్ అన్నారు. దీనికి కూడా కేంద్రం వివ‌ర‌ణ ఇచ్చింది. తాము బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని మాత్ర‌మే చెప్పామ‌ని.. ఎక్కువ‌గా తీసుకున్న రాష్ట్రం తెలంగాణ‌నేన‌ని వివ‌రించింది. ఇలా ఇరు ప్ర‌భుత్వాలు.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నాయే త‌ప్ప‌.. ఎక్క‌డా ప‌రిష్కారం కాలేదు.

మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే.. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని టీఆర్ ఎస్ కూడా ఒక‌రిపై ఒక‌రు వివాదాన్ని నెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయే త‌ప్ప‌.. ప‌రిష్క‌రించేందుకు మాత్రం ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఈ ప‌రిస్థితిని ప‌రిశీలిస్తున్న‌వారు.. ఈ రెండు ప్ర‌భుత్వాల వైఖ‌రిని త‌ప్పుబ‌డుతున్నాయి. పఅధికారంలో ఉన్న మీరు ఇలా చేస్తే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్‌.. రైతుల‌కు డ‌బ్బులివ్వాలా? పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించాలా? అనే ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అంతేకాదు, బీజేపీ, టాఈర్ ఎస్ కొట్టుకుని.. కాంగ్రెస్‌ను సీన్‌లో లేకుండా చేయ‌డం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు.