Begin typing your search above and press return to search.
ఎట్టెట్టా? కేవలం టెస్టుల కోసం అన్ని వేల కోట్లు ఖర్చు చేసేశారా?
By: Tupaki Desk | 7 Feb 2022 5:33 AM GMTషాకింగ్ నిజం ఒకటి వెలుగు చూసింది. గడిచిన రెండేళ్లుగా కరోనా కేసులు ఎంతలా భయపెడుతున్నాయో తెలిసిందే. ప్రపంచానికి చుక్కలు చూపించిన ఈ మహమ్మారికి సంబంధించిన ఒక ఆసక్తికర లెక్క ఒకటి అందుబాటులోకి వచ్చింది. కొవిడ్ కారణంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కోల్పోయిన వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొవిడ్ ఉందా? లేదా? అన్న విషయాన్ని నిర్దారణ చేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు పెట్టిన ఖర్చు లెక్క తెలిస్తే నోట మాట రాలేనంత భారీగా ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
కరోనా నిర్ధారణ కోసం ప్రభుత్వాలు పెద్దఎత్తున టెస్టింగ్ కిట్లను ఏర్పాటు చేయటం తెలిసిందే. రోజువారీగా టార్గెట్లు పెట్టించి మరీ ఉరుకులు పరుగులు తీయించారు. ఇదిలా ఉంటే.. వీటికి అదనంగా తమ అనుమానాల్ని తీర్చుకోవటానికి ప్రైవేటు ల్యాబులకు టెస్టుల కోసం పోటెత్తారు. ఇలా గడిచిన రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా పరీక్షలు చేయించుకోవటానికి దేశ ప్రజలు చెల్లించిన మొత్తం రూ.74వేల కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని తాజాగా గ్రాహక్ భారతి అనే ఎన్జీవో వెల్లడించింది.
ప్రైవేటు సంస్థలు చేసిన పరీక్షల్లో దాదాపు 74 కోట్ల పరీక్షలకు సంబంధించి ఎలాంటి అనుమతి లేని ప్రైవేటు ల్యాబులే పని చేసినట్లుగా పేర్కొన్నారు. ఇక.. పరీక్షల కోసం రోగుల అవసరం.. అదుర్దా ఆధారంగా రేట్లను ఫిక్స్ చేస్తున్న వైనాన్ని వెల్లడించారు. ప్రజల ఆందోళనను గుర్తించి కొన్ని ల్యాబ్ లు అయితే రోజుకు రూ.3500 వరకు వసూలు చేసిన సందర్భాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మొదట్లో రూ.3500 వరకూ పరీక్షల కోసం వసూలు చేస్తే.. ఆ తర్వాత కాలంలో రూ.600 వరకు తగ్గించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటి వద్దనే వచ్చి టీకాలు తీసుకుంటుంటారు.
ప్రజలు చేయించుకున్న 74 కోట్ల పరీక్షల్లో 4.2 కోట్లు మాత్రమే పాజిటివ్ అయినట్లుగా పేరకొన్నారు. కొవిడ్ పరీక్షలు జరిపిన మొత్తం 3255 ల్యాబ్ లలో ప్రైవేటు ల్యాబ్ లు 18 44 అయితే.. ప్రభుత్వ ల్యాబ్ లు 1411 ఉన్నట్లుగా పేర్కొన్నారు. రోజుకు వేలాది పరీక్షలు జరుగుతుంటే.. ఈ నెల 4న ఒక్క రోజులోనే 16.03 లక్షల టెస్టులు చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా..ప్రమాణాలు లేని ల్యాబ్ లు కూడా రోజుకు వేలాది పరీక్షలు నిర్వహించినట్లుగా సదరు సంస్థ పేర్కొంది.