Begin typing your search above and press return to search.

కోవాగ్జిన్‌ క్లియ‌రెన్స్ పై డ‌బ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే !

By:  Tupaki Desk   |   28 Sep 2021 8:30 AM GMT
కోవాగ్జిన్‌  క్లియ‌రెన్స్ పై డ‌బ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే  !
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడించిన సమయంలో వ్యాక్సిన్ మాత్రమే ఈ మహమ్మారి కి కొంతమేర అడ్డుకట్ట వేయబోయింది. అయితే , కరోనా మహమ్మారి కి అడ్డుకట్ట వేసిన కోవాగ్జిన్‌ కు ఇప్ప‌ట్లో క‌ష్టాలు తొలిగేలా లేవు. భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు రావాల్సిన అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తి మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కోవాగ్జిన్ టీకాను ఉత్ప‌త్తి చేస్తున్న భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కొన్ని ప్ర‌శ్న‌లు వేసింది. వ్యాక్సిన్‌కు సంబంధించి సాంకేతిక‌ర‌ప‌ర‌మైన అంశాల‌పై భార‌త్ బ‌యోటెక్ నుంచి డ‌బ్ల్యూహెచ్‌ వో స‌మాధానాలు ఆశిస్తోంది.

అయితే ఈ జాప్యం వ‌ల్ల భార‌తీయుల‌పై ప్ర‌భావం ప‌డ‌నున్న‌ది. ముఖ్యంగా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు చేసే విద్యార్థుల‌కు మ‌రి కొంత కాలం పాటు నిరీక్ష‌ణ‌ త‌ప్పేలా లేదు. అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తి ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్ల అనేక దేశాలు కోవాగ్జిన్ టీకాను గుర్తించ‌డంలేదు. టీకాకు చెందిన అన్ని ర‌కాల డేటాను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు స‌మ‌ర్పించామ‌ని భార‌త్ బ‌యోట‌క్ పేర్కొన్న‌ది. త్వ‌ర‌లోనే కోవాగ్జిన్‌ కు డ‌బ్ల్యూహెచ్‌ వో అనుమ‌తి వస్తుంద‌ని ఇటీవ‌ల కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి చెప్పిన కొన్ని రోజుల్లోనే డ‌బ్ల్యూహెచ్‌ వో వ‌ర్గాల నుంచి ఈ స‌మాచారం అంద‌డం శోచ‌నీయం. కోవాగ్జిన్ మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ డేటా ప్ర‌కారం ఆ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో ప‌నిచేస్తోంది.

కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకుని.. బయటి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇదొక చేదు వార్త. కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతుల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుస్తోంది. స్వదేశీ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’.. డబ్ల్యూహెచ్‌ వో ఈయూఏ లిస్ట్‌ లో లేదు. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌ వో క్లియరెన్స్‌ తప్పనిసరిగా మారింది. రేపో, ఎల్లుండో అనే అంచనాల నడుమ, ఇప్పుడు ఆ క్లియరెన్స్‌ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

ఫేజ్‌ 3 ట్రయల్స్‌ లో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ 77.8 శాతం సమర్థవంతంగా ప్రభావం చూపెట్టిందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించుకుంది.

అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ..మాత్రం కొవాగ్జిన్‌ కు ఇంకా క్లియరెన్స్‌ ఇవ్వలేదు హైదరాబాద్‌ కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే క్లియరెన్స్‌ సంబంధిత దరఖాస్తు పత్రాలను డబ్ల్యూహెచ్‌ వో కి సమర్పించిందికేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ కు గ్లోబల్‌ బాడీ(డబ్ల్యూహెచ్‌ వో) క్లియరెన్స్‌ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తోంది. అయితే నేషనల్‌ ఎక్స్‌ పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ మాత్రం ఈ నెలాఖరుకల్లా క్లియరెన్స్‌ వస్తుందని గతంలో ప్రకటించారు.

కానీ, టెక్నికల్‌ సంబంధిత సమస్యలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ ఆలస్యం.. విదేశాలకు ప్రయాణించే భారతీయులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారనుంది. WHO స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (సేజ్‌) అక్టోబర్‌ 6న జరగబోయే భేటీలో కూడా కొవాగ్జిన్‌ క్లియరెన్స్‌పై స్పష్టత రాకపోవచ్చనే అంటున్నారు. భారత్‌ లో కొవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్‌ ను ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ద్వారా జనాభాకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ సంయుక్తంగా భారత్‌కు చెందిన సీరమ్‌ తో ఒప్పందం ద్వారా కొవిషీల్డ్‌ను తయారు చేసి అందిస్తున్నాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కు డబ్ల్యూహెచ్‌ వో అప్రూవల్‌(సర్టిఫికెట్‌ వెరిఫై ప్రక్రియ ద్వారా కొన్ని దేశాల్లోకి అనుమతిస్తున్నారు) ఉంది. అంతర్జాతీయ వైద్య విభాగంగా భావించే డబ్ల్యూహెచ్‌ వో ఎమర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌ లిస్ట్‌ లో ఇప్పటిదాకా కేవలం.. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నా, సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌ ల కు మాత్రమే చోటు దక్కింది.