Begin typing your search above and press return to search.

భర్త ఇంటికి లేటుగా వస్తున్నాడని భార్య ఏం చేసిందంటే

By:  Tupaki Desk   |   7 Jan 2021 11:30 PM GMT
భర్త ఇంటికి లేటుగా వస్తున్నాడని భార్య ఏం చేసిందంటే
X
మహిళలపై అకృత్యాలు ఇంటా బయటా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఇంటికి లేటుగా వస్తున్నాడనే కోపంతో భర్త ముఖంపై వేడి వేడి నూనె పోసింది భార్య . పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సాగర్‌ జిల్లాకు చెందిన శివకుమారి అహివార్‌ అనే మహిళకు అరవింద్‌ అహివార్‌ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. రోజూ వారి కూలీ పని చేసుకునే అరవింద్‌ ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో భార్యతో గొడవలయ్యేవి. పెద్దలు కల్పించుకుని ఇద్దరికీ సర్ధిచెప్పారు.

అలా చాలా రోజులు గొడవలు పడకుండా ఉన్నారు. దీంతో కొద్దికాలం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి కావు. కానీ సోమవారం ఉదయం భర్త నిద్రలో వుండగా శివకుమారి అతడి ముఖంపై వేడి వేడి నూనె పోసింది.బాధకు తాళలేక బాధితుడి అరుపులు విని అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి ముఖంపై తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివకుమారిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.