Begin typing your search above and press return to search.
ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖలో ఏముంది?
By: Tupaki Desk | 2 July 2021 3:54 AM GMTరెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల మధ్య జలపోరు అంతకంతకూ తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ అధికారపక్షం నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలకుతెర తీస్తుంటే.. అందుకు భిన్నంగా ఏపీ అధికారపక్షం ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా తాము తప్పు చేయలేదంటే.. తాము తప్పు చేయలేదని వాదిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. సరిహద్దుల్లోని ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మొహరించటం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు.
అందులో జలవివాదానికి సంబంధించి తెలంగాణ వాదనకు పూర్తి భిన్నమైన వాదనను వినిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న జలవివాదాలపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. జగన్ లేఖలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
- కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా విభజన చట్టం సెక్షన్–85 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటిదాకా బోర్డు పరిధి, నిర్వహణ నియమావళిని ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేసింది.
- శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను ఆంధ్రప్రదేశ్.. జూరాల, నాగార్జునసాగర్‌లను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించేలా ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలను ఆ రాష్ట్రం నిర్వహించుకునేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. నీటి వాటాల పంపిణీపై 2015 జులైలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు.
- మొత్తం 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు.. తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశారు. ఇందుకు తగ్గట్లు జలాల్ని పంపిణీ చేయటానికి ఇరు రాష్ట్రాల ఈఎన్ సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వారి సిఫార్సుల ఆధారంగా రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా బోర్డు ఉత్వర్వులు జారీ చేసింది.
- ప్రాజెక్టుల్లోకి వచ్చే ప్రవాహాలు.. నీటి నిల్వల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లభ్యతకు తగ్గట్లు దామాషా ప్రకారం ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలి.తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు ఉత్వర్వుల్ని తుంగలోకి తొక్కి అక్రమంగా నీటిని వాడుకుంటూ ఏపీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
- ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు. విద్యుదుత్పత్తికి కనీస నీటి మట్టం 834 అడుగులు. సాగునీటి విడుదలకు కనీస మట్టం 854 అడుగులు ఉండాలి.
- జూన్ ఒకటి నాటికి శ్రీశైలంలో 808.4 అడుగుల్లో 33.39 టీఎంసీల నీరే నిల్వ ఉంది. కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు. కానీ.. కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే తెలంగాణ సర్కారు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించి.. దిగువకు నీటిని విడుదల చేసింది. సాగర్ లో 173.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. సాగర్ ఆయుకట్టకు నీటి అవసరాలు లేకున్నా.. శ్రీశైలం ప్రాజెక్టులో అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసింది.
- జూన్ 30 వరకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 17.36 టీఎంసీల ప్రవాహం వస్తే.. విద్యుదుత్పత్తి కోసం 6.9 టీఎంసీల నీటిని తెలంగాణ సర్కారు అక్రమంగా వాడుకుంది. రోజు రెండు టీఎంసీల నీటిని వాడుకుంటూ తలెంగాణ సర్కారు అక్రమంగా విద్యుదుత్పత్తి చేయటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగటం లేదు. ఇది ఏపీకు ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది.
- శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల స్థాయికి చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తాగు.. సాగునీటి కోసం నీటిని తీసుకునే వీలుంది. ఈ రెగ్యులేటరీ ద్వారానే రాయలసీమ.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాలకు తాగు.. సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తాం. చెన్నైకి తాగునీటిని సరఫరా చేస్తాం.
- తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయటంపై జూన్ 10న కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు లేఖ రాస్తే.. విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని జూన్ 17న తెలంగాణ సర్కారును ఆదేశిస్తూ లేఖ రాసింది.
కానీ.. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని ఆపటం లేదు. ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండా.. ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్ నుంచి 30,400 క్యూసెక్కుల దిగువకు నీటిని విడుదల చేస్తోంది.
- విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేయవద్దని కృష్ణా బోర్డు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందువల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించడానికి తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నా. అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయండి.