Begin typing your search above and press return to search.

వైఎస్ వివేక హత్య కేసు లో దాఖలు చేసిన ఛార్జి షీట్లో ఏముంది?

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:37 AM GMT
వైఎస్ వివేక హత్య కేసు లో దాఖలు చేసిన ఛార్జి షీట్లో ఏముంది?
X
కడప జిల్లా లో వైఎస్ కుటుంబానికి ఒక అడ్డా. ఇక.. పులివెందుల లో వారి మీద ఈగ వాలే ధైర్యం కల లో కూడా ఎవరూ చేయరు. అలాంటి ది వైఎస్ వివేకానంద రెడ్డి లాంటి సీనియర్ నేత ను ఆయన సొంతింట్లోనే దారుణం గా హత మార్చిన వైనం పెను సంచలనం గా మారటమే కాదు.. అంతకు మించిన షాకింగ్ గా మారింది.ఈ కేసు లో నిందితులు ఎవరన్న విషయాన్ని పోలీసులు తేల్చక పోవటం.. కేసు సీబీఐ చేతుల్లో కి వెళ్లిన తర్వాత విచారణ లో వేగం పెరిగింది. పెద్ద ఎత్తున విచారణ.. దర్యాఫ్తు అనంతరం తాజా గా సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందు లో ఏముంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సీబీఐ దర్యాప్తు లో గుర్తించిన అంశాల్ని చూస్తే..

- వైఎస్ వివేకా హత్య కేసు లో ఎర్ర గంగిరెడ్డి.. యాదటి సునీల్ యాదవ్.. గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. షేక్ దస్తగిరి పాత్ర ఉందని తేల్చింది. వీరి లో ప్రస్తుతం ఉమాశంకర్ రెడ్డి.. సునీల్ యాదవ్ లు ప్రస్తుతం జైల్లో ఉండ గా.. ఎర్ర గంగిరెడ్డి.. దస్తగిరి మాత్రం బెయిల్ మీద ఉన్నారు.

- వివేకా వద్ద పీఏ గా పని చేసిన జగదీశ్వర్ రెడ్డి సోదరు డే ఉమాశంకర్ రెడ్డి. కడప జిల్లా సుంకేశుల లో పాల డెయిరీ నిర్వహించే ఇతడు.. ఈ కేసు లో నిందితుడైన సునీల్ యాదవ్ ను వివేకాకు పరిచయం చేశారు. వివేకాను హత్య చేసేందుకు సునీల్ తో కలిసి ప్లాన్ చేశారు. ఇంటి వద్ద ఉండే కుక్క ను ఉమాశంకర్ రెడ్డి కారు తో గుద్ది చంపేశాడు.గుజ రాత్ లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టరేట్ తో పాటు ఇతర ప్రయోగశాలల్లో విశ్లేషించ గా.. ఉమాశంకర్ రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. అంతే కాదు.. సీబీఐ విచారణ లో హత్య లో శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని సునీల్.. దస్త గిరి కూడా వాంగ్మూలం ఇచ్చారు.

- వివేక హత్య కు కొద్ది రోజుల ముందే పరిచయమైన సునీల్ యాదవ్ పులివెందుల మండలం మోట్నూంతల పల్లె. హత్ యకు సంబంధించి ఉమా శంకర్ రెడ్డి తో కలిసి ప్లాన్ చేశాడు. అందు లో భాగం గా తన బైక్ ను సునీల్ కు ఇచ్చాడు. గొడ్డలి ని బైక్ సైడ్ బ్యాగ్ లో దాచి పెట్టారు. దాని మీద నే వివేకా ఇంటి నుంచి తప్పించుకున్నారు. వివేకా ఇంటి వద్ద వాచ్ మన్ గా పని చేసే రంగన్న న్యాయ మూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలం లో హత్య లో సునీల్ పాత్ర ఉందని చెప్పారు. హత్య కు ఉపయోగించిన ఆయుధాలు కూడా సునీల్ కు తెలుసు.

- వివేక హత్య కేసు లో అత్యంత షాకింగ్ గా అనిపించేది.. తూమలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి పాత్ర నే. ఎందు కంటే.. వైఎస్ వివేకాకు 40 ఏళ్లు గా సన్నిహితం గా ఉన్న వ్యక్తే.. హత్య కు సహకరించటం. వివేకా కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు లో అనుమానం వ్యక్తం చేసిన ముఖ్యుల్లో ఇతగాడు ఒకడు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్నఇచ్చిన సాక్ష్యం లో ఎర్రగంగిరెడ్డి తన ను బెదిరించాడని.. హత్యకేసు లో తన పేరు చెబితే నరికేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్లు గా పేర్కొన్నారు.

వివేక దారుణ హత్య తర్వాత ఘటనా స్థలం లోని రక్తపు మరకల్ని.. ఇతర ఆధారాల్ని తుడిచేశారని.. వివేకా మరణించిన విషయం తన తల్లి కి కానీ.. తనకు కానీ ఫోన్ చేసి చెప్పలేదని.. తాము లేకుండానే అంత్యక్రియులు జరిపించే ప్రయత్నం చేశారంటూ వివేకా కుమార్తె సునీత ఈయన పై ఆరోపణలు చేశారు. అంతే కాదు.. నరికి చంపిన గాయాల ఆనవాళ్లు కనిపించినా.. గుండె పోటు తో మరణించారంటూ నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా పేర్కొన్నారు.

- వివేకా వద్ద డ్రైవర్ గా పని చేసిన షేక్ దస్తగిరి.. హత్య జరగటానికి ఆర్నెల్ల ముందు ఆయన వద్ద పని మానేశారు. హత్య లో ఇతడి ప్రమేయం పై వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం ఇవ్వగా.. ఉమాశంకర్ రెడ్డి ప్రమేయం పైనా సీబీఐకు ఇతడు వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ అధికారులు ఢిల్లీ లో రెండు నెలల పాటు విచారించారు.