Begin typing your search above and press return to search.
ఈ ఔట్‌డేటెడ్ నాయకులతో బీఆర్‌ఎస్ సాధించేదేమిటి?
By: Tupaki Desk | 3 Jan 2023 3:41 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో తాజాగా కొద్దిమంది ఏపీ నేతలు చేరిన సంగతి తెలిసిందే. ఇందుకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వేదికైంది. ఈ నాయకులు చేరడంతో బీఆర్‌ఎస్ బలం పుంజుకుందని తెలంగాణ మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెగ ప్రచారం చేస్తున్నారు. జాతీయ మీడియాకు సైతం భారీ స్థాయిలో సందేశాలు పంపారు. ఏపీలో ఇది పెద్ద రాజకీయ పరిణామమంటూ అభివర్ణిస్తున్నారు. అంతేకాకుండా ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని చెప్పేస్తున్నారు.
అయితే తాజాగా బీఆర్‌ఎస్ లో చేరిన ఏపీ నాయకులంతా ఔట్‌డేటెడ్ నాయకులేనని అంటున్నారు. బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన 2009లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2014లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి చిత్తయ్యారు. ఇక 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా ఉండరనే టాక్ ఉంది. అందుకే మూడు పార్టీల తరఫున మూడు చోట్ల ఓడిపోయారని చెబుతున్నారు.
ఇక రావెల కిశోర్ బాబు సైతం ఐఆర్‌ఎస్ అధికారిగా రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో దళితుల కోటాలో ఆయనకు చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చాన్సు ఇచ్చారు. అయితే రావెల వ్యవహార శైలితోపాటు ఆయన కుమారుడి వ్యవహార శైలి బాగోకపోవడం, పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో రావెలను మంత్రి పదవి నుంచి తొలగించారు. దీంతో రావెల కిశోర్ బాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2019లో జనసేన తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి బీఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఈ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో చెప్పలేమని అంటున్నారు.
అలాగే చింతల పార్థసారధి కూడా ఐఆర్‌ఎస్ అధికారే. ఆయన 2019లో జనసేన తరఫున అనకాపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. గట్టిగా చెప్పాలంటే చింతల పార్థసారధి అంటే జనసేన పార్టీలోనే చాలామందికి తెలియదు.
అలాగే ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత తుమ్మలశెట్టి జయప్రకాష్‌నారాయణ కూడా బీఆర్‌ఎస్ లో చేరారు. 2008లో ప్రజారాజ్యంలో చేరిన ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇలా ఈ నాయకులెవరూ ఇప్పుడు రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా లేరు. అలాగే ప్రజాదరణ పొందిన ఇమేజ్‌ను కలిగి లేరు. వారిని బీఆర్‌ఎస్‌లోకి తీసుకుని హైప్ ఇవ్వడం ద్వారా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో ఏం సాధించబోతున్నారని విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.