Begin typing your search above and press return to search.
ఏపీలో ఉద్యోగులు యూటర్న్ తిరిగితే ఏం జరుగుతుంది...!
By: Tupaki Desk | 7 Oct 2022 3:30 PM GMTఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది పక్కన పెడితే.. అసలు వర్గాల వారీగా.. ఎవరి ఓట్లు ఎవరికి పడతాయి? ఎంత మేరకు పడతాయి? అనేది.. ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా.. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఎవరికి వస్తాయి? అన్నది చర్చనీయాంశంగా మారింది. గత 2019 ఎన్నికల్లో.. వైసీపీకి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరించారనే వాదన ఉంది. దీంతో వైసీపీ సునాయాశంగా విజయం దక్కించుకుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. వీరిలో పర్మినెంటు ఉద్యోగులు 22 లక్షల మంది ఉన్నారు. ఇక, మరో రెండున్నర లక్షల మంది పోలీసులు విడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో వీరంతా కూడా.. వైసీపీకి వేశారనే లెక్క ఉంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో నిజంగానే వీరు వైసీపీకి వేస్తారా? అనేది ముఖ్యమైన ప్రశ్న. గత ఎన్నికల్లో.. వైసీపీకి టీడీపీకి మధ్య ఓటు బ్యాంకు తేడా 30 లక్షలు. అంటే.. ఉద్యోగుల ఓట్లలో సగం వరకు దీనిలో భాగంగా చూస్తే.. వైసీపీకి కలిసి వచ్చిందనే చెప్పాలి.
మొత్తంగా ఉద్యోగ కుటుంబాలతో కూడా కలుపుకొంటే.. 60 లక్షలకు పైగానే ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎవరికి పడతాయి? అనేది ప్రశ్న. ఎందుకంటే.. గత ఎన్నికలకు 2024 ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉం ది. గత ఎన్నికల్లో జగన్‌ను ఒకసారి చూద్దాం.. అనే అభిప్రాయంతో ఓట్లు వేశారని మేధావులు చెబుతున్నా రు. అంతేకాదు.. కీలకమైన సీపీఎస్ రద్దు పై కూడా ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇది నెరవేరలేదు. పైగా..వేతన జీవి ఆశించే జీతం కూడా సరిగా ఇవ్వడం లేదు.
కొన్ని కొన్ని విభాగాల్లో ఎప్పుడు ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ దఫా ఉద్యోగుల ఓట్లు వైసీపీకి పడే ఛాన్స్ లేదనే చర్చ జోరుగా జరుగుతోంది. నిజానికి.. జగన్.. ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు.
ఇది తప్ప.. పీఆర్సీ విషయంలోను.. సీపీఎస్ విషయంలోనూ.. పనిగంటల విషయంలో వారికి ఎలాంటి ఉపశమనం కల్పించలేక పోయారు. సో..చంద్రబాబుపై వ్యతిరేకత ఉందా.. లేదా.. అనేది పక్కన పెడితే.. వైసీపీపై మాత్రం ఉద్యోగులకు ప్రేమ పోయిందనేది వాస్తవం. అందుకే వారి ఓట్లు ఈ దఫా.. ఫ్యాన్ నుంచి దూరం కావడం ఖాయమని ఇప్పటికే ఒక అంచనా వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.