Begin typing your search above and press return to search.
బ్రిటన్ ప్రధాని ఎన్నికలో మిగిలిన 3 దశల్లో ఏమేం జరగనుంది?
By: Tupaki Desk | 15 July 2022 4:30 AM GMTప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన.. సంపన్న దేశాల్లో ఒకటైన గ్రేట్ బ్రిటన్ కు ప్రధానమంత్రి అయ్యే అవకాశం భారత సంతతికి చెందిన వ్యక్తిని వరించే అవకాశం మరో మూడు అడుగుల దూరంలో ఉంది. ప్రపంచాన్ని ఏలిన ఆ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం మనోడికి దక్కటానికి మించిన ఆసక్తికర అంశం ఇంకేం ఉంటుంది? ఇదిలా ఉంటే.. ఇప్పటికే రెండు రౌండ్లలో ముందంజలో ఉన్న రిషీ.. తాజాగా మూడో రౌండ్ ఎన్నికల్లోకి వెళ్లిపోయారు. మరో మూడు రౌండ్లలో ఆయన ఇదే ఊపు ప్రదర్శిస్తే.. అందరూ అంచనా వేస్తున్నట్లుగా రిషి బ్రిటన్ ప్రధాని కావటం ఖాయం.
ఇంతకీ బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు అనుసరించే ఎన్నిక విధానం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా ఉంటుందనే చెప్పాలి. ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతుందన్నది చూస్తే.. ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు కన్జర్వేటివ్ చట్టసభ సభ్యుల్లోని వారెవరైనా ముందుకు రావొచ్చు. కన్జర్వేటివ్ చట్ట సభ సభ్యుడ్ని ఎంపీగా అభివర్ణిస్తారు. ప్రధాని పదవి కోసం పోటీ పడేందుకు ఎంతమంది ఎంపీలైనా బరిలో నిలవొచ్చు. అయితే.. వారికి కనీసం ఇద్దరు ఎంపీల మద్దతు చాలా అవసరం.
ఇలా పోటీలో ఉన్న వారి సంఖ్యను తగ్గించేందుకు అనేక రౌండ్లలో ఎన్నికను నిర్వహిస్తారు. ఇదంతా రహస్య బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో తమకు ఇష్టమైన అభ్యర్థికి చివరి ఓటు వరకు ఓటు వేసే వీలు ఎంపీలకు ఉంటుంది. ప్రతి రౌండ్ లోనూ.. ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా సాగే రౌండ్లు.. చివరకు ఇద్దరు మిగిలే వరకు సాగుతూనే ఉంటుంది.
చివరకు పోటీకి మిగిలిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ప్రధాన మంత్రిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. చివరి పోటీలో పెద్ద ఎత్తున ఉండే కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ మద్దతును తెలుపుతారు. ఈ ఓట్లలో గెలుపొందిన వారిని కొత్త నాయకుడిగా ప్రకటిస్తారు. పార్లమెంటులో మెజార్టీ ఎంపీలున్న పార్టీ తరఫు అభ్యర్థే కొత్త ప్రధానిగా ఎన్నిక అవుతారు. అలా ఎన్నికైన వ్యక్తి వెంటనే ఎన్నికలకు పిలుపును ఇవ్వకూడదు. ప్రధాని పదవికి ఎంపికయ్యే నేతను ఎన్నుకోవటానికి ఎంతకాలం పడుతుందన్న విషయంపై కచ్ఛితమైన కాలం ఏమీ ఉండదు.
ప్రధానమంత్రి అభ్యర్థి పదవి కోసం పోటీ పడే వారి రౌండ్లు పెరిగే కొద్దీ ప్రక్రియ ఆలస్యమవుతుంది. 2016లో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ రాజీనామా చేసిన మూడు వారాల్లోపే కొత్త ప్రధానిగా థెరిసా మే బాధ్యతల్ని చేపట్టారు. అదే సమయంలో 2019లో అదే థెరిసా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె స్థానంలో ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు వీలుగా 2019లో నిర్వహించిన ఎన్నిక పూర్తి అయ్యేందుకు రెండు నెలలు పట్టింది. మొత్తంగా బ్రిటన్ ప్రధానమంత్రి పదవి ఎంపిక అన్నది పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఇక.. భారత మూలాలు ఉన్న రిషి బ్రిటన్ ప్రధానమంత్రి కావాలంటే.. మరో మూడు రౌండ్లలో తన అధిక్యతను ప్రదర్శిస్తే సరిపోతుంది. అనుకున్నట్లే అదంతా జరగాలని ఆశిద్దాం.