Begin typing your search above and press return to search.
లగడపాటి క్రెడిబిలిటీ ఏమవుతుందో
By: Tupaki Desk | 8 Dec 2018 7:58 AM GMTతెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇండియా మొత్తంలో లగడపాటి రాజగోపాల్ సర్వేలకు ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ఆయన సర్వేల గురించి ఢిల్లీ లో సైతం మాట్లాడుకుంటారు. గతంలో లగడపాటి ప్రకటించిన అనేక సర్వే ఫలితాలు.. వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. కొన్నిసార్లు మాత్రమే ఆయన జోస్యం ఫలించలేదు. ఐతే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి ప్రకటించిన సర్వే ఫలితా లే అనేక సందేహాలకు తావిస్తున్నాయి.
అందరిదీ ఒక దారైతే తనదో దారి అన్నట్లుగా ఉంది ముందు నుంచి లగడపాటి వ్యవహారం. అందరూ తెలంగాణ రాష్ట్ర సమితిదే అధికారం అంటుంటే.. లగడపాటి మాత్రం ప్రజా కూటమి వైపు నిలిచారు. ఐతే పోలింగ్ ముందు ఎలాంటి ఫలితాలు ప్రకటించినా పర్వాలేదు. అప్పుడు ఓటరు నాడి ఎవ్వరూ పట్టలేరు. ఒపీనియన్ పోల్స్ ఎప్పుడూ అంత కరెక్టుగా ఉండవు.
కానీ ఎన్నికలు అయ్యాక వచ్చే ఎగ్జిట్ పోల్స్ కు విశ్వసనీయత ఎక్కువ. ఐతే ఈ ఫలితాల్లో కూడా లగడపాటి భిన్నంగా నిలిచారు. అందరూ తెరాసదే అధికారం అంటే.. ఈయన మాత్రం ప్రజా కూటమికి ఓటేశారు. దీంతో లగడపాటి విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. ఎన్నికలకు ముందు ప్రజా కూటమికి మేలు చేయడానికి ఆయన వారికి అనుకూలంగా ప్రకటించి ఉండొచ్చేమో. కానీ ఎన్నికల తర్వాత కూడా ఆ పార్టీలకు మద్దతుగా ఉద్దేశపూర్వకంగా ఫలితాల్ని మార్చి చెప్పి ఉంటాడా అన్నది సందేహం.
అలా చేసి ఉంటే దాని వల్ల ఆయనకు ఒరిగేదేమీ లేదు. పార్టీలకూ ప్రయోజనం దక్కదు. ఆ విషయం తెలిసి కూడా లగడపాటి అలా ఎందుకు చేసి ఉంటాడన్న చర్చ నడుస్తోంది. ఏదేమైనప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఈ ఫలితాలు వెల్లడించి ఉంటే మాత్రం రేప్పొద్దున ఫలితాలు దానికి భిన్నంగా వస్తే లగడపాటి క్రెడిబిలిటీకి మామూలు దెబ్బ కాదు. మరి 11న ఏం జరుగుతుందో చూడాలి.