Begin typing your search above and press return to search.
ఆ విషయంలో కేసీయార్ ఓటు : జగన్ కా బాబు కా..?
By: Tupaki Desk | 13 Oct 2022 12:30 PM GMTకేసీయార్ ఏపీలో కూడా తన పార్టీని విస్తరించాలనుకుంటున్నారు. బీయరెస్ పేరిటే ఏపీలో ధూం ధాం గానే రాజకీయం చేయాలన్నది కేసీయార్ మాస్టర్ ప్లాన్. అయితే ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. విభజన సమస్యలు ఒక ఎత్తు అయితే విభజన అనతరం సమస్యలు మరో ఎత్తు. ఇక రాజకీయంగా వైసీపీ టీడీపీ ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ తెచ్చిన సమస్యలు మరో ఎత్తు.
అలాంటి రాజకీయ సమస్యగా ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం. ఉంది. ఇది జోరెత్తిస్తోంది. మరో వైపు చంద్రబాబు సహా మొత్తం ఏపీ విపక్షం అంతా కూడా అమరావతి రాజధానికే జై కొడుతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఈ విషయంలో అమరావతికే ఓటు వేశారు. మూడు రాజధానులు అంటోంది ఒక్క వైసీపీయే.
అలాగే టీయారెస్ తో ఇప్పటికే దోస్తీ కట్టిన వామపక్షాలు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతున్నాయి. అమరావతి రైతులకు ఆ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఇపుడు ఏపీలో కేసీయార్ పార్టీ ఎంటరైతే ఈ విషయం మీద అర్జంటు గా తన అభిప్రాయాన్ని చెప్పి తీరాలి. ఎందుకంటే ఇంతకంటే బర్నింగ్ ఇష్యూ ఏపీ రాజకీయాల్లో మరోటి లేదు అన్నది వాస్తవం. ముందు ఈ వ్యవహారం తేలితేనే మిగిలిన కధ ముందుకు అన్న్నట్లుగా ఉంది.
ఇంకో వైపు చూస్తే జగన్ కి మూడు రాజధానులు అధికార వికేంద్రీకరణ మీద సలహాలు ఇచ్చిందే కేసీయార్ అన్న ప్రచారం అయితే మూడేళ్లుగా సాగుతోంది. విపక్షాలు అయితే అమరావతి ఎక్కడ చక్కగా రాజధాని అయితే తెలంగాణాకు ఇబ్బంది అనే కేసీయార్ జగన్ చేతి మూడు మాట పలికించారు అని కూడా వివిధ సందర్భాల్లో అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఒకవేళ అదే నిజమని అనుకున్నా అదంతా కూడా టీయారెస్ గా ఉన్నప్పటి మాట.
ఇపుడు బీయారెస్ గా మారాక సహజంగా ఏపీ మీద బాధ్యత గల పార్టీగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా అనుకుంటే కనుక కేసీయార్ అమరావతికి జై కొడతారా లేక మూడు రాజధానులే బెటర్ అంటారా అన్నదే అతి పెద్ద చర్చగా ఉంది. ఎటూ అమరావతి రైతులు కేసీయార్ కొత్త పార్టీని కూడా తమకు మద్దతుగా నిలవమని కోరుతారు. ఇంకో వైపు చూస్తే వామపక్షాలు అమరావతికి జై కొట్టాయి కాబట్టి కేసీయార్ కూడా ఆ రూటే తీసుకుంటారా అన్నది కూడా చర్చగా ఉంది.
అయితే కేసీయార్ కి ఏపీ ఓట్లు చాలా కీలకం, అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడం కూడా ముఖ్యం. అందువల్ల ఆయన ఆచీ తూచీ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారనే అంటున్నారు. అంత తేలిగ్గా ఈ విషయంలో బీయారెస్ అధినేత తన అభిప్రాయాన్ని చెప్పేసి ప్రాంతాలకు చెడ్డ కారని ఆయన ఆచీ తూచీ ఈ విషయం మీద మాట్లాడే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు.
మొత్తానికి కేసీయార్ లాంటి ఉద్యమ కారుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి విలువ ఎక్కువ ఉంటుంది. పవర్ కూడా ఉంటుంది. కాబట్టి ఏపీలో రాజధాని రగడకు కేసీయార్ డెసిషన్ తులసీదళంగా మారుతుందా ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అన్నది ఆసక్తిని గొలిపే అంశంగా చూడాలని అంటున్నారు. కేసీయార్ తీసుకునే ఈ నిర్ణయం ఏపీలో రాజకీయంగా కూడా ఆయా పార్టీల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.