Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాల‌న‌పై మోడీ ఏం చెబుతారు.. వైసీపీ ఆశ‌లు తీరుతాయా...!

By:  Tupaki Desk   |   1 July 2022 3:30 PM GMT
జ‌గ‌న్ పాల‌న‌పై మోడీ ఏం చెబుతారు..  వైసీపీ ఆశ‌లు తీరుతాయా...!
X
మ‌రో నాలుగు రోజుల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. ఇది రాజ‌కీయ ప‌ర్య ట‌న కాదు. అధికారిక ప‌ర్య‌ట‌న‌. ప్ర‌ధాన మంత్రి హోదాలోనే ఆయ‌న ప‌శ్చిమ‌గోదావ‌రికి వ‌స్తున్నారు.

ఇక్క డ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125 వ జ‌యంతి కార్య‌క్ర‌మాల్లో పాల్గొని ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవి ష్కరించునున్నారు. అయితే.. ఈ సంద‌ర్భంగా.. మోడీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. మొత్తం రెండు గంట‌ల పాటు ఆయ‌న భీమ‌వ‌రంలో నే ప‌ర్య‌టించ‌నున్నారు.

అయితే.. ఇప్పుడు బ‌హిరంగ స‌భ‌లో మోడీ చేసే ప్ర‌సంగంపైనే వైసీపీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ అద్భుత‌మైన పాల‌న అందిస్తున్నార‌ని. వైసీపీ నాయ‌కులు చెప్పుకొస్తున్నారు. తాజా గా ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ను కూడా వెన‌క్కి నెట్టి ఏపీ ముందు నిలిచింది. ఈ నేప‌థ్యంలో మోడీ త‌న ప్ర‌సంగంలో జ‌గ‌న్ పాల‌న‌పై ఎలా రియాక్ట్ అవుతార‌నేది వైసీపీ నాయ‌కుల‌ను ఉత్కంఠ‌కు గురి చేస్తున్న అంశం.

వాస్త‌వానికి మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు వెళ్లిన‌ప్పుడు.. అక్క‌డ పాల‌న‌పై కితాబు ఇస్తున్నారు. అయితే.. తొలిసారి.. ఆయ‌న బీజేపీయేత‌ర రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. తెలంగాణ‌లో ముందు ప‌ర్య‌టించి..త‌ర్వాత ఏపీకి వస్తున్నారు.

తెలంగాణ‌లో ఎలాగూ.. త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న పార్టీనే ఉంది కాబ‌ట్టి.. అక్క‌డి కేసీఆర్‌స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఖాయమ‌ని అంచ‌నాలు ఉన్నాయి. కానీ, ఏపీ విష‌యానికి వ‌స్తే.. బీజేపీయేత‌ర పార్టీ అయిన‌.. వైసీపీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల‌కంటే.. ఎక్కువ‌గా మోడీని స‌మ‌ర్ధిస్తోంది.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు తీసుకున్నా.. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకున్నా(ఇవి ర‌ద్ద‌య్యాయి), అగ్నిప‌థ్ ప‌థ‌కం తీసుకున్నా..(దీనిపై దేశ‌వ్యాప్తంగా అల్ల‌ర్లు వ‌చ్చాయి. ఏపీలో రాకుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం జాగ్ర‌త్తలు తీసుకుంది) జ‌గ‌న్ స‌ర్కారు అనుకూలంగా ఉంది. అదేవిధంగా హోదాపైనా.. పెద్ద‌గా పెద‌వి విప్ప‌డం లేదు. ఇక‌, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పైనా.. మాట్లాడ‌డం లేదు. అంతేకాదు.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చినా.. కేంద్రం తీసుకువ‌స్తున్న సంస్క‌ర‌ణ‌లు(చెత్త‌పై ప‌న్ను. మునిసిపాలిటీల్లో ప‌న్నుల పెంపు. రైతుల‌కు విద్యుత్ మీట‌ర్లు) అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో మోడీ.. జ‌గ‌న్ స‌ర్కారుపై ఎలా రియాక్ట్ అవుతారు? అనేది వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.