Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ.. ఏం చెబుతారు? ఎలాంటి హామీలిస్తారు..?

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 PM GMT
ఏపీకి మోడీ.. ఏం చెబుతారు?  ఎలాంటి హామీలిస్తారు..?
X
2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఏపీకి వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఏపీలో అడుగు పెడుతున్నారు. నిజానికిఆయ‌న పొరుగున ఉన్న తెలంగాణ‌కు రెండు మూడు సార్లు.. వ‌చ్చినా.. ఏపీ వైపు మాత్రం క‌న్నెత్తి చూడ‌లేదు. దీంతో ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై స్పందించేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డం లేద ని.. అందుకే ఏపీ విష‌యంలో క‌నీసం ఆయ‌న స్పందించ‌డం లేద‌ని.. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినప్ప టికీ.. మోడీ మాత్రం.. ఏపీకి రాలేదు.

కానీ, అనూహ్యంగా ఇప్పుడు భీమ‌వ‌రానికి వ‌స్తున్నారు. ఇక్క‌డ అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొంటారు. అదేవిధంగా అల్లూరి కాంస్య విగ్ర‌హాన్నిఆవిష్క‌రిస్తారు. ఈ సంద‌ర్భం గా నిర్వ‌హించే స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు.

ఇప్పుడు ఈ స‌భ‌పైనే అంద‌రి దృష్టీ ఉంది. ఏం చెబుతారు? ఏవిధమైన కామెంట్లు చేస్తారు? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది. నిజానికి ఇది అధికారిక కార్య‌క్ర మం. సో.. ఏపీ విష‌యంలో మోడీరియాక్ష‌న్ అత్యంత ఆస‌క్తిగా ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే.. ఏపీకి కేంద్రం నుంచి ఎలాంటి పెద్ద సాయం అంద‌లేదు. క‌నీసం.. విబ‌జ‌న హామీల్లో ని కొన్నింటినైనా కూడా తీర్చ‌లేదు. ఇక ప్ర‌త్యేక హోదా.. పాత పాటే అయిపోయింది.

విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ, పోల‌వ‌రం నిధులు.. రాజ‌ధాని నిధులు.. వెనుక బ‌డిన జిల్లాల నిధులు.. రెండు తెలు గు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న వివాదాలు.. స‌మ‌స్య‌ల‌.. నిధుల పంపిణీ.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి మోడీ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు.. ఎలాంటి హాలు ఇస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇదిలావుంటే.. మ‌రోవైపు.. రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితిపై ఆయ‌న ఏమైనా సూచ‌న‌లు చేస్తారా? లేక‌.. పీఎం హోదాలో వ‌స్తున్న ఆయ‌న‌.. అలానే వెళ్లిపోతారా? అనేది ఆస‌క్తిగా మారింది. బీజేపీకి క‌నుక సూచ‌న‌లు ఇవ్వాల‌ని అనుకుంటే.. రాష్ట్రంలో పొత్తుల విష‌యంపై న‌ర్మ‌గ‌ర్భంగా అయినా.. వ్యాఖ్య‌లు చేసే అవ‌కాశం ఉంటుందని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా.. మోడీ ప‌ర్య‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.