Begin typing your search above and press return to search.

ఏపీలో మళ్ళీ మొదటికొచ్చిన 'పంచాయతీ ఎన్నికలు' ఈ సారి నిమ్మగడ్డ ఏం చేస్తారో!

By:  Tupaki Desk   |   12 Jan 2021 10:20 AM GMT
ఏపీలో మళ్ళీ  మొదటికొచ్చిన  పంచాయతీ ఎన్నికలు ఈ సారి నిమ్మగడ్డ ఏం చేస్తారో!
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య పోరు జరుగుతోంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది ఏప్రిల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎస్ఈసీ ఎన్నికలను వాయిదా వేసింది. కరోనా తీవ్రమవుతున్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేసినట్లు కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే, ఆ పార్టీకి మద్దతుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఆరోపణలు చేసింది. అప్పటినుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి మధ్య పోరు నడుస్తోంది.

కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసినట్లు ప్రకటించిన నిమ్మగడ్డ, తాజాగా మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23న తొలి దశ ఎన్నికలు, 27న రెండోదశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ, ఫిబ్రవరి 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లగా.. కరోనా ప్రబలుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న ప్రభుత్వ అభిప్రాయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రజలు జీవించే ప్రాథమిక ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. దీంతో ఫిబ్రవరి లో ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి.

సరిగ్గా కోవిడ్ కు టీకా వేసే సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని.. ఇది వ్యాక్సినేషన్ ప్రక్రియకు అడ్డుగా మారుతుందని హైకోర్టు పేర్కొంది. ఎస్ఈసీ సరైన ఉద్దేశాలతో నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుతో ఏపీలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
కాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు తీర్పుపై ఎన్నికల సంఘం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది.

త్రిసభ్య ధర్మాసనం వాదనలు ప్రారంభమైన కొంతసేపటికి న్యాయమూర్తులు విచారణను వాయిదా వేశారు. ఈరోజు మధ్యాహ్నం తిరిగి విచారణ కొనసాగించనున్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఎన్నికలను వాయిదా వేయడంతో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ మళ్లీ ఎస్ఈసీ పరిధిలోకి వెళ్ళింది.ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు తీరుపై అప్పీలు తదితర విషయాలను వివరించారు. ఉద్యోగులు ఎస్ఈసీకి సహకరించకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని నిమ్మగడ్డ గవర్నర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.