Begin typing your search above and press return to search.
మూడు రాజధానుల మీద సుప్రీం కోర్టు ఏం చెబుతుంది....?
By: Tupaki Desk | 17 Sep 2022 8:02 AM GMTఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి.
ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఉన్నఫళంగా సు కోర్టు తలుపు తట్టింది. ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు ఈ టైం లో దాఖలు చేయడం వెనక ఉన్న వ్యూహం ఏమిటి అన్నదే చర్చగా ఉంది. సాధారణంగా చూస్తే హై కోర్టు ఇచ్చిన తీర్పులనే సుప్రీం కోర్టు కూడా ఆమోదిస్తుంది. అదే సమయంలో కొన్ని కేసులలో సమీక్ష కూడా చేస్తుంది.
ఇపుడు అలాంటిదే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. పైగా హై కోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాలని అడుగుతోంది. స్టే కనుక ఇస్తే అపుడు అమరావతి ఏకైక రాజధాని అన్న ప్రశ్న రాదు. దాంతో ప్రభుత్వం ఈ పిటిషన్ వేసింది. అయితే ఇక్కడ కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి. అవేంటి అంటే శాసనసభలు దేన్ని అయినా చట్టం చేయవచ్చు. అలాగే కొన్నింటిని అవి రద్దు చేసుకోవచ్చు.
రాజ్యాంగం ప్రకారం అవి లేకపోతే కోర్టులు అడ్డుకుని తీరుతాయి. మళ్లీ రాజ్యాంగానికి అనుగుణంగా వాటిని రూపొందించి కోర్టు డైరెక్షన్ల మేరకు కొత్త చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు తేవచ్చు. ఇలా అనేకరకాలుగా కోర్టు తీర్పులు ఉంటాయి. కానీ ఫలానా వాటి మీద చట్టాలు చేయవద్దు అని కోర్టులు ఆదేశించవచ్చా అన్నది మొదటి నుంచి వైసీపీలో జరుగుతున్న చర్చ.
చట్టసభలు ఉన్నవే చట్టాలు చేయడానికి అని సీనిమర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంటి వారు అంటున్నారు. అలాగని రాజ్యాంగాన్ని అతిక్రమించి చట్టాలు చేయడం కూడా చేయకూడదు. ఒక విధంగా చూస్తే అమరావతి రాజధాని అంశం అన్నది చాల సంక్లిష్టమైనది. రాజధాని లేకుండా ఏపీ ఏర్పడింది. విభజన చట్టాన్ని ఉభయ సభలూ ఆమోదించాయి. దాని మేరకు ఏపీ 2014 జూన్ 1 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఉంది.
మరి నాటి నుంచి కొత్త రాజధాని కోసం గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసి చివరికి అమరావతి పేరిట దానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారు. అయితే ఆ తరువాత జగన్ సర్కార్ వచ్చి మూడు రాజధానులను సభలో చట్టంగా చేశారు. అయితే ఆ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని భావించి ఏపీ అసెంబ్లీ దాన్ని రద్దు చేసుకుంది. ఇక రాష్ట్ర రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హై కోర్టు తీర్పు వెలువరించింది.
దీన్ని ఇపుడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఇక్కడ మౌలికమైన ప్రశ్నలు ఏంటి అంటే అసెంబ్లీకి రాజధాని మీద చట్టాలు చేసే అధికారం ఉందా లేదా అన్నది. అలాగే మూడు రాజధానులు అయినా మరెన్ని అయినా పెట్టుకునే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా. ఈ విషయంలో కేంద్రం పాత్ర ఎంతవరకూ అన్నది చూడాలి. అలాగే పార్లమెంట్ ఉభయ సభలలో చేసిన విభజన చట్టం ఏమి చెబుతోంది ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇపుడు ఏపీతో పాటు జాతీయ స్థాయిలో కూడా అందరి కళ్ళూ సుప్రీం కోర్టు మీదనే ఉన్నాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.