Begin typing your search above and press return to search.
అమరావతిపై అమిత్ షాకు జగన్ ఏం చెప్పారు?
By: Tupaki Desk | 27 Aug 2019 8:39 AM GMTఏపీ రాజధాని అమరావతిపై సాగుతున్న రగడ తెలిసిందే. రాజధానికి వరద ముంపు ఉందంటూ ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విపక్షాలకు తోడుగా కేంద్రమంత్రి కూడా వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని విషయంలో తాజాగా కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన జగన్.. ఊహించని రీతిలో వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. రాజధానిపై తాము చెప్పే మాటలేవీ తమ మాటలు కావని.. గత ప్రభుత్వం తయారు చేసి గ్రీన్ ట్రిబ్యునల్ కు అందజేసిన నివేదికే అంటూ ఆధారాలు చూపించినట్లుగా తెలుస్తోంది.
అమరావతి.. పోలవరంపైన జరుగుతున్న పరిణామాల్ని అమిత్ షాకు వివరించిన జగన్.. బాబు హయాంలో తయారు చేసిన రిపోర్ట్ నే రివర్స్ ఆయుధంగా ఆయనపైన గురి పెట్టినట్లుగా సమాచారం. అమరావతిపై అభ్యంతరాలకు సమాధానం ఇచ్చేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ కు ఒక రిపోర్ట్ ను తయారు చేశారు. అందులో వరద కారణంగా చోటు చేసుకునే ముంపు గురించి.. భారీగా అయ్యే నిర్మాణపు ఖర్చుకు సంబంధించిన వివరాల్ని షాకు వివరించినట్లు తెలుస్తోంది.
రాజధానిపై తమ ఉద్దేశం పరిపాలనా వికేంద్రమే తప్పించి మరింకేమీ కాదని చెప్పినట్లుగా సమాచారం. బాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై కొందరు పిటిషన్లు వేయగా.. వాటికి సమాధానాలు ఇవ్వాలని గ్రీన్ ట్రిబునల్ నాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సమాధానం ఇచ్చిన నాటి ప్రభుత్వం.. భారీ వరదలు వస్తే 13వేల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది.
29 గ్రామాల్లో 34 వేల ఎకరాలు సేకరించగా.. అందులో మూడో వంతుకు మాత్రమే ముంపు ప్రమాదం పొంచి ఉందని.. దానిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొంది. నదీ గర్భం నుంచి 25 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు నిర్మిస్తామని చెప్పింది. అందుకు తగ్గ చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి తగ్గట్లే ముంపు బారి నుంచి తప్పించుకోవటానికి వంద అడుగుల లోతులో ర్యాఫ్టు ఫౌండేషన్ టెక్నాలజీతో 40 నుంచి 50 టవర్ల భవనాలు ఐదింటిని నిర్మించేందుకు పనులు ప్రారంభించారన్నారు. ఈ కారణంగా ఖర్చువిపరీతంగా పెరిగిపోతుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి బొత్స ప్రస్తావించారని.. ముంపు మీద తామేమీ కొత్త విషయాల్ని చెప్పటం లేదన్న జగన్ మాటల్ని అమిత్ షా శ్రద్ధగా విన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధానిపై నెలకొన్న సందిగ్దంపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించేందుకు వీలుగా ఈ నెల 29న ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు జగన్. ఈ సందర్భంగా ఏపీ రాజధానిపై తమ వైఖరిని స్పష్టంగా వివరించనున్నట్లు తెలుస్తోంది.