Begin typing your search above and press return to search.
బీజేపీ-టీడీపీ-టీఆర్ ఎస్ కలిసి చేస్తున్న ప్రచారం ఇది!!
By: Tupaki Desk | 20 Oct 2018 6:56 AM GMTభారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితి...సిద్ధాంతపరంగా - నాయకత్వం కోణంలో చూసినా..ఈ మూడు విభిన్నమైనవి. ఆయా పార్టీలు తమదైన శైలిలో రాజకీయం నెరుపుతున్నాయి. దారులు వేరైనా ఈ మూడు పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తమ తమ అజెండాలతో గెలిచిన ఈ మూడు పార్టీలు రాబోయే పోరులో తమ సత్తా చాటేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా...ఈ మూడు పార్టీల మధ్య చిత్రమైన పోలిక ఒకటి తెరమీదకు వచ్చింది. ఆ పోలిక ఈమూడు పార్టీలకు చెందిన దుష్ప్రచారం ఎజెండాలో కావడం అసలు చిత్రం.
జాతీయ పార్టీ అయిన బీజేపీ విషయానికి వస్తే...ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలను - అంశాలను వ్యతిరేకించే వారిని `దేశవ్యతిరేకులు`గా కమళనాథులు ముద్రవేస్తుంటారు. భారతదేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో మిగతా పార్టీల కంటే బీజేపీ మేలు అని ఆ పార్టీకి మద్దతిస్తున్నవారు... పాలన పరంగా విధానాలను - తప్పులను ఎత్తిచూపితే...ఇలా యాంటి నేషనల్ స్టాంప్ వేయడం ఇటీవలి కాలంలో రివాజు అయిపోయింది. ఇక జాతీయ పార్టీగా స్వయం ప్రకటితం అయిపోయిన టీడీపీ అయితే ప్రచారంలో ప్రత్యర్థులపై విషప్రచారం చేయడంలో ఆరితేరిందని అంటున్నారు. ఆ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధానాలను తప్పుపట్టే వారిని వారు ఆంధ్రా అభివృద్ధి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి - నిధుల దుర్వినియోగం. తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక హోదాను పణంగా పెట్టయడం- తెరమీదకు తీసుకువస్తున్న తీరులో...బాబు తీరును బట్టబయలు చేస్తే...వారికి వేస్తున్న ముద్ర అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అంటున్నారు. ఇక తాజాగా జరుగుతున్న ఐటీ దాడుల విషయంలో అయితే - టీడీపీ గగ్గోలు పెడుతున్న తీరు చిత్రంగా ఉందంటున్నారు. ఆ పార్టీ నేతలపై జరిగిన ఐటీ దాడులు ఆంధ్రాపై జరిగిన దాడులుగా ఎలా చూస్తామనేది సగటు ఆంధ్రుడి ప్రశ్న.
ఇక తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సమయంలో తమను ఎవరైనా విమర్శిస్తే తెలంగాణ వ్యతిరేకులుగా - పోరాటాన్ని విచ్చిన్నం చేస్తున్న వారిగా విమర్శలు చేసింది. ఇటీవల కూడా ముందస్తు ఎన్నికల సమయంలో...ఆ పార్టీ తీరును తప్పుపడుతుంటే...ఆంధ్రానేతలు - తెలంగాణ అభివృద్ధి విరోధకలుగా ముద్ర వేస్తోంది. స్థూలంగా....అధికారంలో ఉన్న ఈ మూడు పార్టీలు తమ ఎజెండాలకు మద్దతు ఇవ్వని వారిపై చేస్తున్న ఈ దుష్ప్రచారం ప్రజాస్వామ్యం తీరును ఏ వైపునకు తీసుకుపోతోందో ఆలోచించుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.