Begin typing your search above and press return to search.
ఢిల్లీకి ఈటల.. ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 21 May 2021 8:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో ఈటల ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఇంకా ప్రకటించలేదు. పార్టీ పెడతారా? ఏదైనా పార్టీలో చేరతారా? అనేది క్లారిటీ రాలేదు. ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నా.. ఈటల మాత్రం వేచి చూసేధోరణిలోనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి ఢిల్లీ బాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే.. పలువురు నేతలు ఈటలను కలిసి వచ్చారు. మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేసినందుకు సానుభూతి తెలిపారు. మరికొందరు ఆయన రాజకీయ భవిష్యత్ గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది. వీరిలో.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీచైర్మన్ ఉమ, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు కూడా ఉన్నారు. దీంతో.. కొత్త పార్టీ పెట్టడం ఖాయమనే చర్చ కూడా జరిగింది.
ఇటీవలే ఈటల వర్గం ఓ పాటను రిలీజ్ చేసింది. అది నేరుగా టీఆర్ఎస్ మీద దాడిచేసినట్టుగానే అర్థమవుతోంది. ‘‘యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేతలరా.. సిద్ధమయ్యి ఒక ఆత్మగౌరవ పోరు సల్పుదామా. ఈటల రాజన్నతో ఇక జెండలెత్తుదామా.. దగాకోరుల దౌర్జన్యాన్ని గద్దె దించుదామా’’ అంటూ పాట కూడా రావడంతో యుద్ధం ఖాయమని అనుకున్నారు. కానీ.. ప్రకటన ఏదీ రాలేదు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ పెద్దలను కలిసి మంతనాలు జరిపారు. దీంతో.. ఆయా పార్టీల్లోకి వెళ్తారని కొందరు అంటే.. రాజీనామా తర్వాత వచ్చే ఉప ఎన్నికలో మద్దతు కోసం వెళ్లారని మరికొందరు అన్నారు. ఈ ప్రయత్నాలు ఇటు సాగుతుండగానే.. మరోవైపు టీఆర్ఎస్ తో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈటల ఢిల్లీ వెళ్తున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. సోనియా, రాహుల్ గాంధీలను కలవనున్నారని, ఈ మేరకు అపాయింట్ మెంట్ కూడా సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెండ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని అంటున్నారు. దీంతో.. ఈ మీటింగ్ వెనక ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లడానికి చూస్తున్నారా? ఉప ఎన్నిక మద్దతు కోరడానికా? అనే చర్చ సాగుతోంది. మరి, ఇందులో ఏది నిజం అనేది చూడాల్సి ఉంది.