Begin typing your search above and press return to search.

కరోనాకి ఫ్లూ కి తేడా ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   22 Jun 2020 5:00 PM IST
కరోనాకి   ఫ్లూ కి తేడా ఏమిటంటే ?
X
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకరమైన వ్యాధుల్లో ఈ వైరస్ ఒకటి. చైనాలో మొదటగా కనుగొన్న ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ వల్ల ప్రజలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి కారణంగా 90 లక్షల మందికి పైగా ఇన్ఫెక్షన్లు వ్యాపించాయి.ఈ వైరస్ బారిన పడకుండా ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేక మందిలో భయాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ కోసం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ప్రజలను మరింత భయపెడుతున్నాయి.

జలుబు , దగ్గు , జ్వరం లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా చాలామంది ఆందోళనకు గురి అవుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో చాలామందికి జలుబు దగ్గు వస్తుండగా వైరస్ సమయం కావడంతో వారు కలవరపడుతున్నారు. ఫ్లూకు, కరోనా కు దగ్గరి లక్షణాలు ఉంటాయని.. ఈ వైరస్ లో వాసన రుచిని గుర్తించకపోవడం వంటి లక్షణాలతో పాటు విపరీతమైన నీరసం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణ ఫ్లూ అయితే మూడు నాలుగు రోజుల్లోనే తేలిసిపోతుంది అంటున్నారు.

ఈ రెండు వ్యాధులు ప్రమాదకరమైనవే. వీటి లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయి. అయితే వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకుల ప్రకారం వైరస్ కోసం అధ్యయనం చేస్తున్నప్పటికీ, ఫ్లూ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య ప్రమాదాలలో ఒకటిగా ఉంది. ఇక చికిత్స విషయానికి వస్తే చాలా తేడా కూడా ఉంది. ఫ్లూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రమాదం, సమస్యలను తగ్గించడానికి ఒసెల్టామివిర్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అదే వైరస్ విషయానికి వస్తే ఈ వైరస్‌కి ఇంకా చికిత్స, నివారణ, టీకా లేదు.