Begin typing your search above and press return to search.

గడువు ముగిసింది .. ట్విట్టర్ సైలెంట్ ,కోర్టుకెక్కిన వాట్సప్

By:  Tupaki Desk   |   26 May 2021 5:42 AM GMT
గడువు ముగిసింది .. ట్విట్టర్ సైలెంట్ ,కోర్టుకెక్కిన వాట్సప్
X
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 .. గైడ్ లైన్స్ ఫర్ ఇంటర్మీడియరీస్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట గెజిట్ నోటిఫికేషన్ ను గత కొన్ని రోజుల క్రితం కేంద్రం జారీ చేసిన సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా కంటెంట్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ట్విటర్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు సహా ఓటీటీ వేదికలైన యూ ట్యూబ్, నెట్ ఫ్లిక్స్ తదితర ఓటీటీలు స్వీయ ఐటీ-2021 మార్గ నిర్దేశకాలను విధిగా పాటించాలి.

ఆ రూల్ నేటి నుండి అమల్లోకి వచ్చింది. నిబంధనలను పాటించకుంటే మధ్యవర్తి హోదా రద్దవుతుందని.. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే , కేంద్రం విధించిన కొత్త నిబంధనల పై చివరి క్షణం వరకు వేచి చూసిన కేంద్రం నిర్ణయం లో ఏ మార్పు లేకపోవడంతో కేంద్రం ప్రకటించిన డెడ్‌లైన్ మేరకు.. నిబంధనలు అమలు చేసేందుకు తాము సిద్ధమని ఫేస్‌బుక్, గూగుల్ అధికారికంగా ప్రకటించాయి. అదే సమయంలో ట్విట్టర్ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే భారత ప్రభుత్వం విధించిన కొత్త రూల్స్‌ ను సవాల్ చేస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లుగా సమాచారం అందుతోంది.

ట్విట్టర్ గత కొన్ని రోజులుగా కేంద్రంతో యుద్ధం చేస్తోంది. బీజేపీ నేతలు చేస్తున్న ట్వీట్లకు మ్యానిపులెటెడ్ మీడియా అనే ట్యాగ్ పెడుతూండటంతో వారి ఆఫీసుల్లో పోలీసులతో సోదాలు కూడా చేస్తున్నారు. రైతుల ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి కేంద్రానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యంగా ట్విట్టర్‌ లో వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దీనితో కట్టడి చేయాలనుకున్న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. నిబంధనలన అమలుకు ఆయా సంస్థలు భారత్‌ లో అధికారులను నియమించుకోవడం, నెటిజన్ల ఫిర్యాదులను పరిష్కరించడం, ఎవరైనా అభ్యంతరక కంటెంట్ పోస్ట్ చేస్తే తొలగించడం వంటివి చేయాలి. అంతేకాదు ఏదైనా పోస్ట్ లేదా మెసేజ్ గురించి ప్రభుత్వం అడిగితే.. ఆ మెసేజ్‌ను మొదట ఎవరు సృష్టించారు, అనే వివరాలను వెల్లడించాలి. ఐతే ఇది యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని వాపోతోంది. వారి వివరలను బహిర్గతం చేయలేమని స్పష్టం చేస్తోంది. కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కేంద్రం మూడు నెలలు అవకాశం ఇచ్చింది. మే 25తో ఆ గడువు ముగిసింది. ఇప్పటివరకు దేశీయ సోషల్ మీడియా సంస్థ ‘కూ’ మినహా ఏ కంపెనీ కూడా భారత్‌ లో ప్రత్యేక అధికారులను నియమించలేదు. ఇదిలా ఉంటే కేంద్రం నిర్ణయాలని కొన్ని సోషల్ మీడియా సంస్థలు అంగీకరించాయి. కానీ, ట్విట్టర్ అందకు ఒప్పుకోలేదు. అలాగే వాట్సప్ కేంద్రం కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. దీనితో కేంద్రం ఏం చేస్తుందనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.