Begin typing your search above and press return to search.

వాట్సాప్ మరో సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   16 Jan 2021 12:37 PM GMT
వాట్సాప్ మరో సంచలన నిర్ణయం
X
ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సంచలన నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించింది. వాట్సాప్ ఇటీవల కాలంలో తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ఎంత వివాస్పదం అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వ్యతిరేకించారు.

వాట్సాప్ కస్టమర్లు ఫేస్ బుక్ తో తమ డేటాను పంచుకోవడానికి ప్రైవసీకి భంగం కలుగుతోందని టెలిగ్రామ్, సిగ్నల్ కు మరలుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యూజర్లతో నడుస్తున్న వాట్సాప్ కు ఈ డేటా షేరింగ్ తో పెద్ద దెబ్బ పడింది. ఈ అప్ డేట్ తో చాలా మంది వాట్సాప్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు.

భారత్ లోని ప్రతి ఇద్దరిలో ఒకరు వాట్సాప్ ప్రైవసీ పాలసీని వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. దీంతో వాట్సాప్ తమ నూతన ప్రైవసీ పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే 15 వరకు తమ పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నట్లు ట్వీట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది. ఫిబ్రవరి 8లోపు నూతన పాలసీను అంగీకరించకపోతే అకౌంట్ డిలీట్ చేస్తానని వాట్సాప్ హెచ్చరించింది. దీంతో యూజర్ల నుంచి వాట్సాప్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

ఈ క్రమంలోనే యూజర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నూతన పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నామని వాట్సాప్ ట్వీట్ చేసింది. మనం చేసిన కాల్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి వాడుతున్నామనే లోకేషన్ కూడా ఫేస్ బుక్ ట్రాక్ చేయదని తెలిపింది. సలహాలు, సందేహాలు ఉంటే నేరుగా పంపించవచ్చని వాట్సాప్ పోస్టు చేసింది.