Begin typing your search above and press return to search.

వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఆడియో...కేసు నమోదు!

By:  Tupaki Desk   |   28 March 2020 12:01 PM GMT
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఆడియో...కేసు నమోదు!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ 198కిపైగా దేశాల్లో విస్తరించిన ఈ మహమ్మారి వేలాది మంది ప్రాణాలని తీసింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్‌ డౌన్ కొనసాగుతోంది. 300 కోట్లమందికి పైగా ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. అయినా, వైరస్ మరణాలు - బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 27,350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా - బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంది. ఇక మన దేశంలో కూడా కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 902కు చేరగా మృతుల సంఖ్య 20కి పెరిగింది.

ఇకపోతే , ప్రపంచ వ్యాప్తంగా కరోనా అలజడి సృష్టిస్తున్న ఈ నేపథ్యంలో కరోనా పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. కరోనా ఫలానా వాళ్లు అలా చెప్పారని - ఇలా చెప్పారని, ఫలానా విధంగా చేస్తే కరోనా సోకదంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ కోవలోకే బ్రహ్మంగారి మఠాన్ని కూడా చేర్చారు. బ్రహ్మంగారి మఠంలో ఆలయ పూజారి చనిపోయాడని - మిరియాలు - అల్లం - బెల్లం కలుపుకొని తాగితే కరోనా రాదంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన దహన సంస్కారాలు పూర్తయ్యేలోపే ఈ కషాయం తాగాలంటూ కూడా కండిషన్లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే , ఇది నిజం కాదు అని - బ్రహ్మంగారి మఠం ఆలయ మేనేజర్ ఈశ్వరయ్య స్పష్టం చేసారు. ఈ ప్రపంచంలో ఏది జరిగినా కూడా ..అది ముందే బ్రహ్మం గారు చెప్పారు అని చెప్పడం అలవాటుగా మారిపోయింది.

ఇకపోతే , తాజాగా వాట్సాప్ లో ఒక ఆడియో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనితో ఈ ఆడియో టేప్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ కి చెందిన ఒక డాక్టర్ కి - ఒక రిపోర్టర్ కి మధ్య కరోనా పై జరిగిన సంభాషణ ఇదే అంటూ ఒక ఆడియో వైరల్ అవుతుంది. అయితే - ఇది అబద్దం అని - ఆ హాస్పిటల్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ..కేసు నమోదు చేసారు. దీనితో అసలు ఈ ఆడియో ఎవరు - ఎక్కడి నుండి ఫోర్వర్డ్ చేసారో త్వరలోనే బయటపెడతాం అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.