Begin typing your search above and press return to search.

వాట్సప్‌లో కొత్త ఆప్షన్‌ వచ్చింది గమనించారా?

By:  Tupaki Desk   |   23 Aug 2016 1:30 AM GMT
వాట్సప్‌లో కొత్త ఆప్షన్‌ వచ్చింది గమనించారా?
X
సాంకేతికవిప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. కొత్త కొత్త సదుపాయాలు వినియోగదార్లకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్‌ ఆధారిత జీవనశైలి మితిమీరిపోతున్నది. అదే సమయంలో వాటికి ఎడిక్ట్‌ అయిపోకుండా, అవసరాలకోసం వాడుకోదలచుకుంటే.. చాలా సదుపాయాలను ఈ స్మార్ట్‌ ఫోన్‌ లు మనకు అందిస్తున్నాయి. అలాంటి వెబ్‌ బేస్డ్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ లో వాట్సప్‌ ఇప్పటికే విపరీతమైన జనాదరణతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వాట్సప్‌ను ఫోనుతో పాటు, ఆ ఫోను దగ్గర ఉన్నప్పుడు డెస్క్‌ టాప్‌ లేదా లాప్‌ టాప్‌ లో కూడా ఆపరేట్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. అంటే ఎక్కువగా కంప్యూటర్‌ మీద వర్క్‌ చేసేవారు. ప్రత్యేకంగా.. ఫోనులోనే టైప్‌ చేయాల్సిన అవసరం లేకుండా, బ్రౌజర్‌లోని వాట్సప్‌ నే వాడుకోవచ్చు. కంప్యూటర్‌ లోని ఫోటోలు - డాక్యుమెంట్లు - కెమెరాతో తీయదలచుకున్న దృశ్యాలను అక్కడినుంచే ఎటాచ్‌ చేసి పంపేయవచ్చు. దీనివల్ల ఫోను మెమరీకి ఖర్చయ్యేది ఉండదు.

తాజాగా వాట్సప్‌ డెస్క్‌ టాప్‌ వెర్షన్‌ లో ఎటాచ్‌ మెంట్‌ లు చేయడానికి మరో కొత్త సదుపాయం కూడా కల్పించారు. ఇదివరకే ఫోటో - కెమెరా - దాక్యుమెంట్‌ (పీడీఎఫ్‌ లు లేదా వర్డ్‌ డాక్యుమెంట్లు) ఎటాచ్‌ చేసే ఫెసిలిటీ ఉండగా తాజాగా కాంటాక్ట్‌ నెంబర్‌ ను కూడా ఇక్కడ ఎటాచ్‌ మెంట్‌ ద్వారా మెసేజి పంపే వెసులుబాటు ఇచ్చారు. ఇదివరకు వాట్సప్‌ లో కాంటాక్ట్‌ పంపాలంటే.. టైప్‌ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డెస్క్‌ టాప్‌ లో డైరక్ట్‌ గా కాంటాక్ట్‌ ను ఎటాచ్‌ చేసేలా ఇచ్చారు.

అలాగే ఫోను లో అయితే మరికొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇందులో అదనంగా ఆడియో ఫైల్స్‌ - లొకేషన్‌ లను కూడా మెసేజిగా పంపే వెసులుబాటు ఉంటుంది. ఇందులో కూడా కాంటాక్ట్‌ ను మెసేజీగా పంపే ఆప్షన్‌ ను జత చేశారు. సో - వాట్సప్‌ ప్రియులు ఈ సదుపాయాలను విచ్చలవిడిగా వాడుకోవచ్చు. మెసేజీ టైప్‌ చేసే ఓపిక లేకపోతే.. ఆడియో ఫైల్‌ రికార్డ్‌ చేసి పంపేయవచ్చు. మీరు ఎక్కడకు వెళుతున్నారో, ఎక్కడ ఉన్నారో.. ఎవరికైనా తెలియజేయాలనుకుంటే.. లొకేషన్‌ ను మెసేజీగా పంపొచ్చు. కొత్తవాటితోపాటు ఈ పాతవి అన్నీ కూడా మంచి సదుపాయాలే మరి!