Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌: వాట్సాప్ స‌రిగా ప‌ని చేయ‌టం లేదు

By:  Tupaki Desk   |   3 Nov 2017 10:19 AM GMT
బ్రేకింగ్‌: వాట్సాప్ స‌రిగా ప‌ని చేయ‌టం లేదు
X
సెల్ ఫోన్ జీవితాన్ని మార్చేస్తే.. స్మార్ట్ ఫోన్ ఎంట్రీ మ‌నిషి లైఫ్‌ ని పూర్తిగా మార్చేసింది. శ‌రీరంలో ఒక అవ‌యువంగా మారిపోయిన సెల్ ఫోన్‌ కు వాట్సాప్ ప్రాణంగా మారిపోయింది. ఐదారేళ్ల కింద‌ట వాట్సాప్ లేకున్నా బండి న‌డిచిపోయింది. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. వాట్సాప్ ప‌ని చేయ‌కుంటే? ఆ ఆలోచ‌న‌ను కూడా మ‌న‌సు ఒప్పుకోలేని ప‌రిస్థితికి వెళ్లిపోయాం.

వాట్సాప్‌.. జీమొయిల్‌..గుగూల్‌.. ఫేస్ బుక్‌.. ట్విట్ట‌ర్ లాంటివి ప‌ని చేయ‌టం మానేస్తే ఏమ‌వుతుంది? నిజానికి ఏమీ కాదు. కానీ.. ఆ మాట విన్నంత‌నే గుండె గుభేల్ మ‌న‌టం ఖాయం. అలా జీవితాన్ని శాసిస్తున్న కొన్ని డిజిట‌ల్‌ ప్రాప‌ర్టీస్ లో వాట్సాప్ ప్ర‌ధాన‌మైంది.

ఈ రోజు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కూ బాగానే ప‌ని చేసిన వాట్సాప్ ఉన్న‌ట్లుండి ప‌ని చేయ‌టం మానేసింది. ఎంత ట్రై చేసినా క‌నెక్ట్ కాని ప‌రిస్థితి. మెసేజ్ పంపితే వెళ్ల‌క‌పోవ‌టం.. ఫోటోలు.. ఫైల్స్ ఇలా నిత్యం స‌వాల‌చ్చ చేసే వాట్సాప్ ఏం చేసినా రియాక్ట్ కాని ప‌రిస్తితి. ఇది గ‌మ‌నించిన కొంద‌రు త‌మ ఫోన్లు ఏమైనా స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌న్న ఉద్దేశంతో రీస్టార్ట్ చేసినోళ్లు చాలామందే.

అయితే.. స‌మ‌స్య అంతా వాట్సాప్ దేన‌న్న విష‌యం ఆ కంపెనీ వెల్ల‌డించింది. స‌ర్వ‌ర్ ప్రాబ్ల‌మ్ కార‌ణంగా ఇలా జ‌రిగింద‌ని తెలుస్తోంది. వాట్సాప్‌లో త‌లెత్తిన సాంకేతిక ఇబ్బంది కార‌ణంగా ఇట‌లీ.. సౌదీ అరేబియా.. ఫిలిఫ్పైన్స్‌.. జ‌ర్మ‌నీ.. భార‌త‌దేశం.. శ్రీలంక‌.. అమెరికాల‌లోని వాట్సాప్ అకౌంట్లు కాసేపు ప‌ని చేయ‌టం మానేశాయి. ఈ ఇష్యూ మీద వాట్సాప్ రియాక్ట్ అయ్యింది. యుద్ధ ప్రాతిప‌దిక‌న ఇష్యూను క్లియ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. త‌మ‌దే త‌ప్ప‌ని ఒప్పుకొంది. ఇబ్బంది ఎదురైంద‌ని చెప్పి.. సేవ‌ల్ని య‌థావిధిగా పున‌రుద్ద‌రించింది. సో.. ఇక్క‌డ చెప్పేదేమంటే.. కొన్నిసార్లు వాట్సాప్ కూడా ప‌ని చేయ‌క‌పోవ‌చ్చు. దానికీ మెంట‌ల్ గా సిద్ధ‌మై.. ప్ర‌త్యామ్నాయాన్ని సిద్ధం చేసుకొని ఉండ‌టం మంచిది.