Begin typing your search above and press return to search.
దారుణం.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నాలుకను కోసేశాడు..!
By: Tupaki Desk | 4 Jan 2023 9:21 AM GMTప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం.. ఇంటర్నెట్ ప్లాన్స్ కారుచౌకగా లభ్యమవుతుతండటంతో జనాలు ఎక్కువగా ఆన్ లైన్లోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు జీవితంలో మేటా.. ట్విట్టర్.. వాట్సాప్.. టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు భాగస్వామ్యం అవుతున్నాయి.
వాట్సాప్ లో చాటింగ్ తదితర ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ కోసం చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవుతున్నారు. సరదాగా ప్రారంభమైన గ్రూప్ డిస్కషన్స్ కొన్నిసార్లు వివాదాలకు సైతం దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కోసారి గ్రూప్ అడ్మిన్ పై సైతం ఇతరులు దాడిచేసే సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో పోలీస్ కేసులు కూడా తరుచుగా నమోదవుతున్నాయి.
తాజాగా ఓ వాట్సాప్ గ్రూప్ లో చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు నాలుకలు తెగే వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పూణెలోని ఫుర్సుంగికి చెందిన సొసైటీ ఓ వ్యక్తి కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఈ మేరకు ఆ వ్యక్తి సొసైటీ పేరు మీద 'ఓం హైట్స్' పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు.
ఈ సొసైటీ గ్రూపుకు అడ్మిన్ గా ఉంటూ చాలామందిని అందులో జాయిన్ చేసుకున్నాడు. అయితే ఏమైందో తెలియదుగానీ ఓ వ్యక్తిని గ్రూప్ అడ్మిన్ తొలగించాడు. దీనిపై సదరు వ్యక్తి గ్రూప్ నుంచి తనను తొలగించడానికి గల కారణాలను అడిగాడు. అయితే ఈ విషయంపై గ్రూప్ అడ్మిన్ నుంచి ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే గ్రూప్ నుండి తొలగించబడిన వ్యక్తి అడ్మిన్ పై కోపం పెంచుకున్నాడు. ఏకంగా అతడు పనిచేస్తున్న కార్యాలయానికి ఐదుగురు వ్యక్తులతో కలిసి వెళ్లి దాడి చేశారు. ఈ సంఘటనలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నాలుక చిట్లి పోయింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు అతడికి చికిత్స చేయి నాలుకకు కుట్లు వేశారు.
ఈ సంఘటనపై అడ్మిన్ భార్య దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఇదే నగరంలో మూడ్రోజుల క్రితం హ్యాపీ న్యూయర్ విషెస్ చెప్పనందుకు ఓ వ్యక్తి చేయిని మరో వ్యక్తి విరిచి వేయడం గమనార్హం. మొత్తానికి వాట్సాప్ గ్రూప్ లు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ పెంచడంతో పాటుగా మరోవైపు వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.