Begin typing your search above and press return to search.

వాట్సాప్ లో నయా ఫీచర్ ఇదే!

By:  Tupaki Desk   |   15 Sep 2017 1:30 AM GMT
వాట్సాప్ లో నయా ఫీచర్ ఇదే!
X
సోషల్ మెస్సేజింగ్ యాప్.. వాట్సాప్ ఇప్పుడు ఒక నయా ఫీచర్ ను వినియోగదారులకి అందించబోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ను వాడేవారి సంఖ్య 100 కోట్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, లేటెస్ట్ టెక్నాలజీని అప్ డేట్ చేస్తూ వస్తోంది వాట్సాప్. ఇది ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు - వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది. కాకుంటే ఫోన్ లో ఇంటర్నెట్ ఉండాలి.

అయితే వాట్సాప్‌ లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం, తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. కానీ రానున్న కొద్దిరోజుల్లో వాట్సాప్‌ లో పంపిన సందేశాన్ని వెనక్కి తీసుకోవడానికి 'రీఓక్/ రీకాల్' అని పిలిచే ఆప్షన్ ఒకటి వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. సందేశాలే కాకుండా వీడియోలు - జిప్ ఫైల్స్ - డాక్యుమెంట్స్ - స్టేటస్ రిప్లైస్ కూడా వెనుకకు తీసుకోవచ్చంట.

ఈ ఆప్షన్ ద్వారా మనం పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి చూడనంతవరకు.. అంటే మనకు డబుల్ బ్లూ టిక్ కనిపించనంత వరకు మనం ఆ మెసేజ్‌ ని డిలీట్ చేయడం/వెనక్కి తీసుకోవడం చేయొచ్చు. ప్రస్తుతం కొందరితో టెస్ట్ చేస్తున్న ఈ ఆప్షన్ అతిత్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ఇప్పటికే మనదేశానికే చెందిన టెలిగ్రామ్ లో అందుబాటులో ఉంది. వైబర్ లో కూడా ఉంది. ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి వస్తే పొరపాటున వేరే వ్యక్తులకు వెళ్లిన సందేశాలను, ఫొటోలను వెంటనే వెనుకకు తీసుకోవచ్చు.