Begin typing your search above and press return to search.

వాట్సాప్ టు ఫేస్ బుక్.. కొత్త ఫీచర్

By:  Tupaki Desk   |   24 Sep 2019 1:30 AM GMT
వాట్సాప్ టు ఫేస్ బుక్.. కొత్త ఫీచర్
X
ప్రపంచ ఫేమస్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘వాట్సాప్’ సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా బీటా వెర్షన్ వినియోగదారులకు ఈ కొత్త సౌకర్యాన్ని కల్పించింది. వాట్సాప్ ను అప్పట్లోనే ఫేస్ బుక్ సంస్థ కొనేసింది. దీంతో ఈ రెండింటి మధ్య అనుబంధాన్ని పెంచేందుకే ఈ కొత్త మార్పును తీసుకొచ్చింది.

ఇక నుంచి వాట్సాప్ స్టేటస్ ను డైరెక్ట్ గా ఫేస్ బుక్ స్టోరీగా మార్చుకునే కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకొచ్చింది. వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకునే ఫొటో లేదా వీడియోలను ‘షేర్ టు ఫేస్ బుక్ స్టోరీ’గా మలుచుకునే కొత్త బటన్ వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ స్టేటస్ కుడివైపున ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేస్తే ఈ ‘షేర్ టు ఫేస్ బుక్ స్టోరీ’ అనే ఆప్షన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన వాట్సాప్ స్టేటస్ ఫేస్ బుక్ లోకి వెళ్లిపోతుంది.

ఇక వాట్సాప్ మ్యూట్ అనే కొత్త ఆప్షన్ ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. మనకు కొందరు ఫ్రెండ్స్ కానీ అభిమానులు కానీ ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం - రాత్రి అదే పనిగా గుడ్ మార్నింగ్ లంటూ ఇతర అర్థం పర్థం లేని మెసేజ్ లు పెట్టి విసిగిస్తారు. వారికి వద్దని డైరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. అలా చికాకు పుట్టించే వారికోసమే ఈ వాట్సాప్ మ్యూట్ అనే కొత్త ఫీచర్. వాళ్లను మ్యూట్ చేస్తే ఆ వ్యక్తుల షేరింగ్ పూర్తిగా మనకు కనిపించకుండా వాట్సాప్ హైడ్ చేస్తుంది. దీంతో మనకు చికాకు తప్పుతుంది.