Begin typing your search above and press return to search.

వాట్సాప్ యూజర్స్ కు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   26 July 2019 4:29 AM GMT
వాట్సాప్ యూజర్స్ కు గుడ్ న్యూస్
X
గూగుల్ పే. డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అయ్యేలా అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తున్న ఈ యాప్ బాగా హిట్ అయ్యింది. పైగా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కావడంతో ఫుల్ సెక్యూరిటీతో చాలా సింపుల్ గా నగదు బదిలీ చేసుకుంటున్నాం. ఇక వేరే ఇతర వాలెట్ ఆధారిత పేమెంట్స్ యాప్స్ ఈ గూగుల్ పే ముందు కొట్టుకుపోయాయి.

అయితే గూగుల్ పేకు పోటీగా ఇప్పుడు జనాలందరికి పరిచయమైన ఫుల్ ఫేమస్ సోషల్ మీడియా యాప్ ‘వాట్సాప్’ వినియోగదారులకు ఒక శుభవార్తను చెప్పింది. త్వరలోనే వాట్సాప్ కూడా పేమెంట్స్ రంగంలోకి దిగుతోంది. డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు విస్తృతమవుతున్న నేపథ్యంలోత్వరలోనే ‘వాట్సాప్ పేమెంట్స్’ను లాంచ్ చేయాలని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్ కార్ట్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం వాట్సాప్ పేమెంట్స్ ప్రయోగదశలో ఉంది. దీన్ని బీటా వెర్షన్ ను దాని యజమాని ఫేస్ బుక్ పరీక్షిస్తోంది. తాజాగా భారత్ లోని 10లక్షల మంది యూజర్లతో ఈ యాప్ బీటా వెర్షన్ ను పరీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక వాట్సాప్ పేమెంట్స్ ప్రారంభించడానికి ముందు భారత రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు.. గూగుల్ పే కంటే సులభంగా డబ్బులు పంపేలా వాట్సాప్ తీర్చిదిద్దుతోంది. ఇక డైరెక్ట్ బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా దేశంలోని బ్యాంకులతో ఒప్పందాలు కూడా వాట్సాప్ చేసుకుంటోంది. ఈ యాప్ కనుక అందుబాటులోకి వస్తే నగదు బదిలీ మరింత సులభం కానుంది. దేశంలోని ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉంది. వాట్సాప్ వస్తే మరింత డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ఇది లాంచ్ కాబోతోంది.