Begin typing your search above and press return to search.
అదే జరిగితే.. వాట్సప్ తో నో పర్సనల్?
By: Tupaki Desk | 22 Sep 2015 4:17 AM GMTదేశంలో వాట్సప్ అంటే తెలీని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు చాలాతక్కువ మందే ఉండొచ్చు. చిటికెలో కోరుకున్న ఫోటోను.. వీడియోను పంపించుకోవటంతో పాటు.. ఛాటింగ్ చేసుకోవటానికి వీలు కల్పించే వాట్సప్ ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. వాట్సప్ పుణ్యమా అని సామాన్యులు మొదలు రాజకీయ నేతల వరకూ ఎందరో ఎన్నో రకాలుగా వినియోగిస్తున్నారు.
అయితే.. వాట్సప్ వినియోగం విషయంలో కేంద్ర సర్కారు తాజాగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. సదరు నిర్ణయం కానీ అధికారికం అయితే.. వాట్సప్ వినియోగదారుల పాలిట పెద్ద షాక్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. కేంద్రం తీసుకునే నిర్ణయం ఏమిటంటే.. వాట్సప్ వినియోగించే వారు.. తమ మెసేజ్ లను మూడు నెలల వరకూ డిలీట్ చేయకూడదని చెబుతున్నారు.
తాము చేసే ఛాటింగ్ వివరాల్ని మూడు నెలల వరకూ డిలీట్ చేయకూడదని.. వాటిని అలానే ఉంచేయాలన్న నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. వాట్సప్ వినియోగదారులు తాము చేసే ప్రతి ఛాటింగ్ ను మూడు నెలలు కచ్ఛితంగా ఉంచాల్సి వస్తుంది. చట్టరూపంలో తీసుకురానున్న ఈ నిర్ణయం అనుకున్నట్లే జరిగితే మాత్రం.. వాట్సప్ వినియోగదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ చాటింగ్ చేయాల్సి ఉంటుంది.
కేంద్రం కాని ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. వ్యక్తిగతంగా ఇప్పటివరకూ ఎన్నో లక్షల మంది చేసే ఎన్నో పనులు గుట్టురట్టు కావటమే కాదు.. కొత్త సమస్యలకు దారి తీస్తాయన్న భావన ఉంది. ప్రతి ఛాటింగ్ ను మూడు నెలలు దాచి ఉంచటం అంత చిన్న విషయం కాదు. మరి.. దీనిపై ప్రజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.