Begin typing your search above and press return to search.
వాట్సాప్ పేమెంట్స్.. వచ్చేస్తోంది.
By: Tupaki Desk | 28 Jun 2019 4:42 AM GMTనగదు బదిలీ.. నరేంద్రమోడీ ‘నోట్ల రద్దు’ పుణ్యమాని ఇప్పుడు దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఆ పరిణామాన్ని అందిపుచ్చుకొని పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేలాంటి సంస్థలు భారీగా లాభపడ్డాయి. కోట్లకు పడగలెత్తాయి. దేశంలో మోడీ వచ్చాక బ్యాంకు లావాదేవీలు తగ్గి ఆన్ లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి.
ఇప్పటికే దేశంలో గూగుల్ పే, ఫోన్ పే సహా అన్ని బ్యాంకులు తమ యాప్ ల ద్వారా యూపీఐ , భీమ్ పేమెంట్స్ పేరిట ఆన్ లైన్ చెల్లింపులకు అవకాశం కల్పించాయి. అయితే ఆర్బీఐ కఠిన నిబంధనల నేపథ్యంలో వాట్సాప్ మాత్రం ఇన్నాళ్లు ఆన్ లైన్ ట్రాన్స్ సాక్షన్ వ్యవహారాలను చేపట్టలేదు.
వాట్సాప్ ను కొనుగోలు చేసిన ఫేస్ బుక్ సంస్థ వ్యవహారాలు అన్ని అమెరికా నుంచే నడుస్తాయి. ఇక గూగుల్ పే- అమేజాన్ పే లాంటి విదేశీ సంస్థలు కూడా మొదట ఈ లావాదేవీల యాప్స్ పెట్టడానికి ముందు ఆర్బీఐ కఠిన నిబంధనలు విధించింది.
ఇప్పటికే డేటా దుర్వినియోగం అయ్యి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు భద్రతకు ముప్పుకలుగుతున్న దృష్ట్యా ఆర్బీఐ భారత దేశంలో డేటాను భద్రపరిచిన వారికే పేమెంట్స్ లావాదేవీలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే విదేశాల్లోనుంచి ఆపరేట్ అవుతున్న సదురు సంస్థలకు ఇది భారీ వ్యయ ప్రయాసల ప్రక్రియ. అందుకే తటపటాయించారు. కానీ ఈ కోవలోనే గూగుల్- అమేజాన్ లు దేశంలో డేటా సెంటర్ ఓపెన్ చేసి తమ పేమెంట్స్ యాప్స్ సర్వీసులను కొనసాగిస్తున్నాయి.
ఇక ఆర్బీఐ కఠిన నిబంధనలతో వాట్సాప్ పేమెంట్స్ సర్వీసులు ఇన్నాళ్లు ఆపేసింది. తాజాగా దేశంలోనే డేటా స్టోరేజీ కేంద్రాన్ని నెలకొల్పింది. దీంతో త్వరలోనే వాట్సాప్ పేమెంట్స్ అందుబాటులోకి రానుంది.
ఇన్ స్టంట్ పేమెంట్ యాప్ అయిన వాట్సాప్ దేశంలోని కోట్ల మందికి చేరువైంది. ప్రతి వ్యక్తికి వాట్సాప్ ఉంది. సెకన్లలో సమాచారం చేరవేస్తున్న ఈ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా అంతే స్పీడుగా జరిగే అవకాశం ఉంది. వాట్సాప్ తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు చెల్లింపులు మరింత ఈజీ కానున్నాయి.