Begin typing your search above and press return to search.
2 రోజుల తర్వాతా డిలీట్ చేసేయొచ్చు.. వాట్సాప్ సరికొత్త అప్డేట్
By: Tupaki Desk | 9 Aug 2022 11:30 PM GMTమనిషి బతకటం అంటే గాలి.. నీరు.. ఎంత ముఖ్యమో చేతికి స్మార్ట్ ఫోన్.. అందులో డేటా అన్నదిప్పుడు అంతే ముఖ్యంగా మారిన సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్.. అందులో డేటా ఉన్న తర్వాత.. డౌన్ లోడ్ చేసే మొదటిది వాట్సాప్.
అంతలా మనిషిజీవితాన్ని ప్రభావితం చేసిన వాట్సాప్.. అది లేకుండా బతకలేని పరిస్థితుల్లోకి ఇప్పుడు ప్రపంచం వచ్చేసింది. ఎవరినైనా.. వారి వాట్సాప్ ను పది రోజులు వాడకుండా బతకమని చెబితే.. అసాధ్యమని చెప్పేస్తారు. అంతలా తన మీద ఆధారపడేలా చేసుకుంది వాట్సాప్. దీని గొప్పతనం ఏమంటే.. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ.. కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చేసుకోవటం.
తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. అదేమంటే.. రెండు రోజుల క్రితం చేసిన మెసేజ్ ను సైతం డిలీట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్ని ట్విటర్ ద్వారా వాట్సాప్ పేర్కొంది. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా.. రానున్న కొద్ది రోజుల్లో మరింతమందికి ఈ సౌకర్యం వస్తుందని పేర్కొంది.
మొదట్లో వాట్సాప్ ద్వారా ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని డిలీట్ చేసుకునే సదుపాయం ఉండేది కాదు. దీంతో.. పొరపాటున మెసేజ్ లు పంపిన వారు.. ఆ తర్వాత చాలానే ఇబ్బంది పడేవారు. యూజర్లు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన వాట్సాప్.. మేసేజ్ లను డిలీట్ చేసే ఆప్షన్ పు పరిచయం చేసింది. అయితే.. మెసేజ్ పంపిన తర్వాత 68 నిమిషాల 16 సెకన్ల వరకు డిలీట్ చేసే అవకాశం ఉండే సదుపాయాన్ని కల్పించింది.
అయితే.. కొన్ని సందర్భాల్లో ఆ తర్వాత కూడా డిలీట్ చేసే సౌకర్యం ఉంటే బాగుండన్న పరిస్థితి. అందుకు తగ్గట్లే.. తాజాగా కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏదైనా మెసేజ్ ను పంపిన తర్వాత రెండు రోజుల 12 గంటలవరకు పాత మెసేజ్ లను డిలీట్ చేసేందుకు వీలుగా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.
అంతేకాదు.. వాట్సాప్ అన్న తర్వాత గ్రూపులు ఎంత ఎక్కువగా ఉంటాయో తెలిసిందే. ఇలాంటి గ్రూపులకు చెందిన ఆడ్మిన్లు.. గ్రూపు సభ్యులు పంపిన మెసేజ్ లను తొలగించేందుకు ఆడ్మిన్లకు అవకాశం ఉండే ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉందని చెబుతున్నారు. ఏమైనా.. తాజా ఫీచర్ మరింత మందికి లాభం చేకూరేలా చేస్తుందని చెప్పొచ్చు,.