Begin typing your search above and press return to search.

వారు పరాయి ''ఆడోళ్ల'' పక్కన కూర్చోరంట

By:  Tupaki Desk   |   10 April 2015 10:30 PM GMT
వారు పరాయి ఆడోళ్ల పక్కన కూర్చోరంట
X
డిజిటల్‌ యుగంలో కొత్తకొత్త వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగినప్పుడు మనిషి ఆలోచనలు మరింత విస్తృతం కావాలి. మరింత నాగరికంగా వ్యవహరించాలి. తోటి మనుషుల పట్ల మర్యాద.. గౌరవంతో ఉండాలి.

కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో అమెరికా నుంచి ఇజ్రాయిల్‌ మధ్య ప్రయాణించే వారిలో పెరుగుతున్న కొత్త సంస్కృతికి ఇదో నిదర్శనం. యూరప్‌లోని వివిధ దేశాల్లో జ్యూయిష్‌ సంప్రదాయాల్ని పాటించే వారు ఇంట్లో వారిని తప్పించి.. మిగిలిన మహిళల స్పర్శ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటారట. ఈ మధ్య కాలంలో ఈ సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొస్తూ.. నానా రచ్చ చేస్తున్నారు.

న్యూయార్క్‌ నుంచి లండన్‌ వెళ్తున్న విమానంలో హోగి అనే నలభైఏళ్ల మహిళ విమానంలోని తన సీట్లో కూర్చుంది. ఆమె పక్క సీటు ఒక జ్యూయిష్‌ వ్యక్తికి కేటాయించారు. అయితే.. తాను తన భార్య తప్ప మరో మహిళ స్పర్శను అంగీకరించనని.. తాను ఆ మహిళ పక్క కూర్చొనని మొండికేశారట. దీన్ని అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టిన విమాన సిబ్బంది చివరకు.. అతనికి వేరే సీటు కేటాయించి ఇష్యూను క్లోజ్‌ చేశారంట.

విమానాల్లో ఈ తరహా సంఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయని.. జ్యూయిస్‌ ధర్మం పాటించే వారు మహిళల్ని తాకే చిన్న అవకాశం ఉందంటే ఆమడ దూరానికి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.