Begin typing your search above and press return to search.

కేటీఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న వేళ..

By:  Tupaki Desk   |   21 Jan 2021 11:30 AM GMT
కేటీఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న వేళ..
X
వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో పార్టీని గాడినపెట్టే పనిలో పడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముందుగా అస్సలు టీఆర్ఎస్ బలంగా లేని ఖమ్మం జిల్లాపై కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం జిల్లా నేతలతో తాజాగా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు, పార్టీ పరిస్థితి, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు తదితర అంశాలపై తాజాగా చర్చించారు. ఈ భేటిలో ప్రజాప్రతినిధులు, నేతలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఖమ్మంలో అభివృద్ధి పనుల వివరాలను కేటీఆర్ కు అందజేశారు.

ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే తీరు దురుసుగా ఉందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పాత అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. 'ఎమ్మెల్యేలు ఉంటారు.. పోతారని.. కానీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండడం అవసరం' అని కేటీఆర్ అన్నారు. పార్టీ నాయకులంతా కలిసి పనిచేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని.. జమిలి వచ్చినా రాకపోయినా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ టీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని.. పార్టీకి ఇబ్బందికరంగా మారే నేతలను ఉపేక్షించమని కేటీఆర్ హెచ్చరించారు. మొత్తంగా ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశం మంత్రి కేటీఆర్ ఆగ్రహంతో అక్కడ హాట్ హాట్ గా సాగింది.